praకాశం బ్యారేజీకి వరద ప్రవాహం
Jul 2 2021
విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రహదారులపై నీరు నిలిచి చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని బట్టి బ్యారేజీ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులుపడ్డారు. విజయవాడలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వర్షాల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతాంగం భావిస్తోంది
No comments:
Post a Comment