Tuesday 3 September 2024

హైద్రాబాద్ లో హైడ్రా డర్

 హైద్రాబాద్ లో హైడ్రా డర్

Mallik Paruchuri

  · 

హైద్రాబాద్ లో హైడ్రా డర్, సమర్ధించే వారు కొందరు, వ్యతిరేకించే వారు ఇంకొందరు, చెరువులను ఆక్రమించి కబ్జా చేసి అపార్టుమెంట్లు కట్టేసి ఎప్పుడో అమ్మేసి లాభం పొందింది ఒకరు అయితే ఇప్పుడేం చేయాలో అర్థం కాక త్రిశంకు స్వర్గంలో ఫ్లాట్లు కొన్న మధ్య తరగతి ప్రజలు, మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? పర్యావరణ ప్రేమికులు కోరుకున్నట్లు కూల్చాల్సిందేన???

నేను ఇప్పుడు ప్రగతి నగర్ లో ఉంటున్న, ప్రగతీ నగర్ చెరువు మధ్యలో రోడ్డు, చూడగానే అర్ధం అవుతుంది చెరువును మధ్యలో పూడ్చి అటూ ఇటూ పోవడానికి రోడ్డు వేశారు అని. మరి ఇప్పుడు HYDRA అంబర్ చెరువు (ప్రగతీ నగర్ చెరువు) ని రక్షించడానికి పునరుద్ధరించడానికి  ప్రగతీ నగర్ -JNTU రోడ్డును ను తవ్వేయగలదా?? అప్పుడు వచ్చే ప్రజల వ్యతిరికేత ప్రభుత్వ పెద్దలు తట్టుకోగలరా ? అసలు ధైర్యం చేయగలరా? మరి చట్టం అభాసుపాలు అయినట్లే కదా?

ఈ గొలుసు కట్టు చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్ని ఇది వరకు జనాభా నివాసం లేని సమయంలో వ్యవసాయం చేయడానికి అప్పటి పాలకులో, ఊరి పెద్దలు కలిసి కృత్రిమం గా వర్షపునీరు  నిలువ ఉండటం కోసం వేసిన కట్టలు, ఆ ఏర్పాటు చేసిన కట్టల వల్ల చెరువు ఏర్పడి FTL level వరకూ నీరు నిలువ ఉండేది, FTL నిండాక అలుగు పారి లింక్ అయిన నాలాల ద్వారా నదికి లింక్ చేయబడినవి, దానితో ముంపు లేకుండా వర్షపు నీరు నదికి అక్కడి నుండి సముద్రానికి చేరుతుంది.

మరి ఇప్పుడు ఆ చెరువుల కింద వ్యవసాయమే లేదు, నిలువ చేసిన నీరు చుట్టూ ఉన్న జనాభా తాగే పరిస్థితి లేదు, అంతగా డ్రైనేజీ కలిసి కంపు కొడుతున్నాయి, మరి ఏమిటి ఉపయోగం? ఇప్పుడు వాటివల్ల ఏకైక ఉపయోగం భూగర్భ జలాలు పెరగడం, నష్టాలు  దోమల ఫ్యాక్టరీ లుగా మారి డెంగ్యూ మలేరియా లు ప్రభలటం తప్ప 

మరి పరిష్కారం ఏమిటి?

FTL, buffer zone లో భూములకు పట్టాలు ఉంటాయి, చెరువులో నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించిన పట్టాలు అవి, పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా అని అక్కడ భూములు లేఅవుట్ లు వేసి ప్లాట్ లు చేసి బిల్డింగ్ లు కట్టకూడదు, వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు మార్చాలి అంటే NALA tax కట్టి MRO దగ్గర అనుమతి పొందాలి, NALA tax కట్టకుండా చేపట్టిన నిర్మాణాలు కూల్చాల్సిందే, FTL buffer zone లో భూములకు MRO ఒకవేళ NALA tax కట్టించుకుని అనుమతి ఇచ్చివుంటే అటువంటి వాటి నీ రెగ్యులరైజ్ చేయాలీ, అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి 

మధ్యే మార్గంగా ఇప్పుడున్న ఆక్రమణదారుల నుండి  మార్కెట్ వాల్యూ వసూలు చేసి వారికి భవిష్యత్తు ముంపు లేకుండా FTL height తగ్గించండి, వచ్చిన ఆదాయం చెరువు కొత్త FTL ప్రకారం కాంక్రీట్ లైనింగ్ చేసి నగరం నాలాలు మొత్తం మూసీ కి లింక్ చెయ్యండి, చెరువులో కలిసే ప్రతీ చుక్క డ్రైనేజీ నీరు STP లు పెట్టి శుద్ధి చేసి మాత్రమే చెరువులో కలిసే లా చూడాలి 

భవిష్యత్తు లో ఆక్రమణ చేస్తే concern అధికారులకు భారీ శిక్షలు ఉండేలా కొత్త కఠిన చట్టాలు తేవాలి, అధికారులు నిక్కచ్చిగా ఉంటే ఎవడూ కబ్జా చేయలేడు , కనీసం ఇప్పటికయినా ఉన్న చెరువులను protect చేసుకోవడం మంచిది

Mallik Paruchuri వాల్ నుంచి






No comments:

Post a Comment