గోదావరి-కావేరీ అనుసంధానం సాధ్యమేనా?
ABN
, Publish Date - Jun 13 , 2025 | 04:42 AM
24న
హైదరాబాద్‌లో నదుల అనుసంధాన సంప్రదింపుల కమిటీ భేటీ
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి
- కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన
అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్‌లో జాతీయ నీటిఅభివృద్ధి
సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం
(సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. కేంద్రం ఇప్పటి వరకూ పోలవరం నుంచి గోదావరి-కావేరీ
అనుసంధాన ప్రాజెక్టును ఒప్పుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం న్యూఢిల్లీలో
జరిగిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధాన
ప్రక్రియ ఎంతవరకొచ్చిందని ఆరా తీసినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ
అనుసంధానం చేపట్టాలని పట్టుబట్టిన ఏపీ.. తాజాగా రూట్ మార్చి గోదావరి-బనకచర్ల అనుసంధానంలో
భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించే 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్
నుంచే ‘బొల్లాపల్లి-కావేరీ అనుసంధానం’ చేపట్టాలని కేంద్రాన్ని
కోరింది. పోలవరం విస్తరణలో భాగంగా రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు కొత్తగా
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది.
అంతటితో ఆగక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని
46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట గోదావరి-బనకచర్ల అనుసంధానానికి
నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరుతున్నది. బొల్లాపల్లి - కావేరీ అనుసంధానానికి
ఒప్పుకుంటే మాత్రం.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి
ఉంటుంది.
గోదావరి - కావేరి
నదుల అనుసంధానం
సందర్భం
గోదావరి
- కావేరి నదుల అనుసంధానం మరోసారి తెరమీదికి వచ్చింది.
ఈ
ప్రాజెక్టు మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను తెలుసుకోవడానికి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA)
జూన్ 24న హైదరాబాద్ లో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ
సమావేశానికి కేంద్ర జల వనరుల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షత వహిస్తారు.
ప్రశ్నలు :
1.
గోదావరి
- కావేరి అనుసంధానం (GC Link) ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం వుందా?
2.
ఈ
ప్రాజెక్టువల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
3.
ఈ
ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ
అభిప్రాయం ఏమిటీ?
4.
తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?
5.
పోలవరం
నుండి గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండేది.
ఇప్పుడు బొల్లాపల్లి నుండి కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరుతోంది. ఈ మార్పుకు కారణం
ఏమిటీ?
6.
గోదావరి
– బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటీ?
7.
ఏపీ
పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46 (2), 46 (3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. అలా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం వుందా?
8.
బచావత్
ట్రిబ్యూనల్ నాటికి గోదావరి నదిలో మిగులు నికర జలాలున్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితివుందా?
9.
గోదావరి
నుండి కావేరి బేసిన్ కు నికరజలాలను కేటాయిస్తారా?
10.
అలా
చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సమస్యలు ఏమిటీ?
No comments:
Post a Comment