Saturday, 6 June 2020

డీపీఆర్‌లు ఇవ్వండి- తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు

Jun 5 2020 @ 03:12AMహోంతెలంగాణ

డీపీఆర్‌లు ఇవ్వండి కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
ప్రభుత్వాలతో మాట్లాడి చెప్తామన్న అధికార్లు
పట్టిసీమలో 45 టీఎంసీల వాటా ఇవ్వాలి
సాగర్‌లోని 50 టీఎంసీలు క్యారీ ఓవరే
పోతిరెడ్డిపాడుతో 175 టీఎంసీలు తోడారు
పోతిరెడ్డిపాడు విస్తరణ,
రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయాలి: తెలంగాణ
మా కోటా నీటి వాడకానికే ఆ ప్రాజెక్టులు: ఏపీ
తెలంగాణ వాదనలో మోదీ ఎన్నికల ప్రసంగం
ఈ ఏడు కూడా పాత పద్ధతినే కేటాయింపులు


హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జల సౌధలో గురువారం ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM




తెలంగాణ తరఫున సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం ఇంజనీర్లు, ఏపీ నుంచి సాగు నీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత డీపీఆర్‌లు సమర్పిస్తామని అధికారులు బోర్డుకు తెలిపారు.



వాటిని ఆపేయండి.. కోటా మార్చండి

తొలుత తెలంగాణ అధికారులు తమ వాదన వినిపించారు. ప్రత్యేక ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ ప్రాజెక్టులకు నష్టం కలిగించే, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న కోటా (తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు)లో మార్పులు చేయాలని కోరారు. తాగు నీటి కోసం కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నదాంట్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న 50 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని, వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.



పోతిరెడ్డిపాడు నుంచి ఏడాదికి 101 టీఎంసీలను మాత్రమే తరలించాల్సి ఉండగా.. ఏపీ గతేడాది 175 టీఎంసీలను తీసుకుందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డిపై ఏపీ ఫిర్యాదును ప్రస్తావిస్తూ, వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, దీనికి సాక్ష్యంగా 2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీచేసిన ప్రసంగాన్ని వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి పాత ప్రాజెక్టేనని చెప్పడమే తమ ఉద్దేశమని తెలంగాణ అధికారులు వివరించారు.



మా ప్రాజెక్టులనూ రీ డిజైన్లుగానే చూడండి

కృష్ణా బేసిన్‌లో తమ కోటా నీటి వినియోగానికే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతలను చేపడతున్నట్లు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు రీ డిజైన్‌ అయినప్పుడు, తమవాటినీ అలాగే భావించాలన్నారు. రాష్ట్ర విభజన 2014లో జరిగినందున.. తర్వాత జారీ చేసిన జీవోలన్నీ కొత్త ప్రాజెక్టుల కోసమనే పరిగణించాలని కోరారు. ఈ లెక్కన పాలమూరు-రంగారెడ్డి, డిండి కొత్త ప్రాజెక్టులేనని అన్నారు. అనుమతులు వచ్చేవరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని బోర్డు సూచించింది.



బోర్డు తీసుకున్న నిర్ణయాలు..

గత ఏడాదిలానే బేసిన్‌ నీటిని రెండు రాష్ట్రాలు 66: 34 శాతం నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి. నీటి లెక్కలు తేలేవరకు వాడకం ఇదే పద్ధతిన సాగాలి.
టెలీమెట్రీ యంత్రాల రెండో దశ ఏర్పాటును కచ్చితంగా అమలు చేయాలి.
శ్రీశైలం జల విద్యుత్‌ను చెరిసగం వాడుకోవాలి.
బేసిన్‌లో మిగులు జలాలను సమానంగా వాడుకోవాలి. 2019-20లో ఉపయోగించుకున్న మిగులు నీటి లెక్కల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలి.
సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో నీటి నష్టంపై ఇప్పటికే నియమించిన కమిటీ క్షేత్ర పరిశీలన చేయాలి.
తాగునీటికి అవసరాలకు కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై కేంద్ర జల సంఘానిదే తుది నిర్ణయం.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ఉన్న తెలంగాణ నీటి వాటాను క్యారీ ఓవర్‌గా పరిగణించడంపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకుని, బోర్డు మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి వస్తుంది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న గోదావరి నీటిలో తెలంగాణ వాటాను తేల్చే అంశం, కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలింపుపై నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అప్పగింత.


నేడు గోదావరి బోర్డు సమావేశం

గోదావరి బోర్డు శుక్రవారం సమావేశం కానుంది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈ అంశాలపై చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

గోదావరి పై కొత్త ప్రాజెక్టులు ఆపేయండి

Jun 6 2020 @ 02:43AMహోంతెలంగాణ

గోదావరి పై కొత్త ప్రాజెక్టులు ఆపేయండి

అనుమతి లేని వాటిని నిర్మించొద్దు

పదో తేదీలోగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లివ్వండి

తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు చైర్మన్‌ ఆదేశం

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల్లేవ్‌.. కాళేశ్వరం కొత్తదే: ఏపీ

మా వాటా 967 టీఎంసీల వాడకానికే ఈ ప్రాజెక్టులు

పోలవరం ముంపుపై మళ్లీ సర్వే జరగాలి.. తెలంగాణ డిమాండ్‌


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను జూన్‌ 10వ తేదీలోగా సమర్పించాలని గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులను పొందేందుకు వీలుగా డీపీఆర్‌లను సమర్పించాలని సూచించింది. అనుమతులు పొందాకే ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగించాలని కోరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో నీటి వాడకాన్ని అంచనా వేయడానికి వీలుగా టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని, ఈ అంశంపై ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. గోదావరి బోర్డు సమావేశం శుక్రవారం జలసౌధలో జరిగింది. బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాన చర్చ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణపై జరిగినట్టు సమాచారం. కాళేశ్వరంతో పాటు, దేవాదుల మూడవ దశ, రామప్ప నుంచి పాకాల, సీతారామ వంటి ఏడు ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసింది. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు తెలంగాణ స్పష్టం చేసింది. దీనిని పాత ప్రాజెక్టుగానే గుర్తిస్తున్నట్టు కేంద్రం కూడా లేఖను రాసిందని అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఫిర్యాదులను పట్టించుకోకుండా, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా లేఖ రాస్తుందని ఏపీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్థలం మారిందని, ఉపయోగించే నీటి సామర్థ్యం పెరిగిందని, ఆయకట్టు మారిందని, దిగువకు వచ్చే నీటి ప్రవాహంలో భారీగా తగ్గిపోతోందని ప్రస్తావించారు. తెలంగాణ ప్రాజెక్టులకు బోర్డు అనుమతి కానీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు కానీ లేవని ఆరోపించింది. తమకు కేటాయించిన 967 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికే ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలంగాణ అధికారులు వివరించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని చెప్పారు.

పట్టిసీమ నుంచి కృష్ణాకు తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాల్సి ఉందని బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ట్రైబ్యునల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని తెలంగాణ అధికారులు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం అధికారులు సర్వే నిర్వహించారని, దేశంలో కేంద్ర జలసంఘం కన్నా అత్యున్నత సంస్థ లేదని ఆంధ్రప్రదేశ్‌ బదులిచ్చింది. ఇరు రాష్ర్టాల వాదనల అనంతరం బోర్డు కొన్ని నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనది.. ఈ నెల 10లోపు రెండు రాష్ట్రాల్లో గోదావరి కింద చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరు ప్రభుత్వాలు సమర్పించాలి. గోదావరి బేసిన్‌పై ఎక్కడెక్కడ టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలనే అంశాన్ని ఖరారు చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది..

కొత్తప్రాజెక్టులు చేపట్టలేదు: రజత్‌కుమార్‌

గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టలేదని బోర్డుకు స్పష్టం చేశామని సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ చెప్పారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న నీటి కోటాను ఉపయోగించుకోవడానికే ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు 967 టీఎంసీల నీటి కోటా ఉన్నట్టు అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనను, ఇచ్చిన ఉత్తర్వులను బోర్డు దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ కూడా తెలంగాణకు 967.14 టీఎంసీలు కేటాయించిందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 445 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు నుంచి అదనంగా నీటిని తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ మీద ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గోదావరిలో ఎక్కడెక్కడ, ఎన్ని టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ఇస్తారని చెప్పారు. కాళేశ్వరాన్ని 225 టీఎంసీలకు డిజైన్‌ చేసి, 400 టీఎంసీలు తీసుకువెళ్తున్నారని ఏపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తర్వాతే నిర్మాణాలు: బోర్డు చైర్మన్‌ అయ్యర్‌

గోదావరి నదిపై చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపునర్విభజన చట్టం కింద బీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతుల కోసం డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉందని చెప్పారు. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.

దీనిపై కేంద్రానికి నివేదిక ఇచ్చామన్నారు. రెండు రాష్ట్రాలకు లేఖలను కూడా రాసినట్టు వివరించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు వచ్చిన తర్వాతనే నిర్మాణాలను చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రతిపాదనకు సంబంధించి సమస్యలను పరస్పరం పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గోదావరి బేసిన్లో టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అంతర్‌ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద తగిన ప్రాంతాలను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్తవాటికి బ్రేక్‌

గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి
10లోగా డీపీఆర్‌లు సమర్పించండి
తెలుగు రాష్ట్రాలకు జీఆర్‌ఎంబీ ఆదేశం
బోర్డు భేటీలో ఆంధ్ర ఫిర్యాదుపై చర్చ
సమగ్ర నివేదిక సమర్పణకు తెలంగాణ సమ్మతి
టెలిమెట్రీలపై జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీ

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపేయాలని గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. వాటన్నిటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని నిర్దేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 225 టీఎంసీలు, జీఎల్‌ఐఎ్‌స-3కి 22 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 110 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 23.76 టీఎంసీలు, ఇతరత్రా పథకాలతో కలిపి మొత్తం 450.31 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తోందని ఆంధ్ర తన ఫిర్యాదులో పేర్కొనగా.. ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. గోదావరిలోని 1,426 టీఎంసీల జలాల్లో 650 టీఎంసీలు తెలంగాణకు.. 776 టీఎంసీలు తమకు దక్కుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఈ సమావేశంలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 660 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116 టీఎంసీలు దక్కుతాయని వివరించింది.


తెలంగాణ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 472 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178 టీఎంసీలు.. మొత్తం 650 టీఎంసీలు వాటాగా వినియోగించుకునే వీలుందని పేర్కొంది. కాగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటికి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని.. సాంకేతికాంశాలు కొన్ని చూపుతున్నందున వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డీపీఆర్‌లను సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవే అయినందున.. డీపీఆర్‌లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదించారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణఱ భూభాగంలో సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించినందునే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించాకే.. డీపీఆర్‌లను సమర్పిస్తామన్నారు. అయితే డీపీఆర్‌లను సమర్పించాల్సిందేనని జీఆర్‌ఎంబీ తేల్చిచెప్పింది. ఇందుకు తెలంగాణ సరేనంది. ఆంధ్ర కూడా అంగీకరించింది. ఈ నెల పదో తేదీలోపు వాటిని సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి. పెద్దవాగు ప్రాజెక్టు అంశాన్ని రెండు రాష్ట్రాలూ కలసి పరిష్కరించుకునేందుకు సరేనన్నాయి. రెండు రాష్ట్రాల్లో టెలిమెట్రీల ఏర్పాటుకు జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీని వేయాలని తీర్మానించాయి.

స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు: చైర్మన్‌

బోర్డు సర్వసభ్య సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆ  తర్వాత విలేకరులకు వెల్లఇంచారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 తర్వాత గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘానికి, బోర్డుకు సమర్పించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమ్మతిని పొందేందుకు తెలంగాణ అంగీకరించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సప్లిమెంటరీ డీపీఆర్‌లను ఇవ్వడానికి సమ్మతించిందని చెప్పారు. గోదావరి జలా ల వినియోగాన్ని లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీల ఏర్పాటుకు వీలుగా జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, జలసంఘం, పుణేలోని సీడబ్ల్యుపీఆర్‌కు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.

Thursday, 28 May 2020

గోదారి ఎగిరింది.. తెలంగాణ మురిసింది

గోదారి ఎగిరింది.. తెలంగాణ మురిసింది
175 అంతస్తుల ఎత్తుకు భగీరథ యత్నం
నాలుగేళ్లలో సాకారం

ఐదంతస్తుల అపార్టుమెంటు! దానిపై ఒకదానిపై మరొకటిగా 35 అపార్టుమెంట్లను పేరిస్తే.. అమ్మో..! ఆకాశాన్ని తాకుతుందని ఆశ్చర్యపోతాం కదా! ఇప్పుడు మేడిగడ్డ నుంచి గోదారమ్మను కూడా అంత ఎత్తుకు తీసుకొచ్చారు! సముద్ర మట్టం నుంచి మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్ర మట్టం నుంచి కొండపోచమ్మ సాగర్‌ 624 మీటర్ల ఎత్తులో ఉంది! అంటే, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ 524 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు!! ఇది అర కిలోమీటరు కంటే ఎక్కువన్నమాట! మరో మాటలో చెప్పుకోవాలంటే.. దాదాపు 175 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుంది! అంత ఎత్తుకు మేడిగడ్డ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని తీసుకొచ్చారన్నమాట! ఒక టీఎంసీ అంటే 2,832 కోట్ల లీటర్లు. పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లలో ఆ నీటిని నింపాలంటే, అక్షరాలా 26,32,000 ట్యాంకర్లు అవసరం. అటువంటిది 15 టీఎంసీలను అంత ఎత్తుకు ఎత్తిపోయడం అంటే మాటలా!! ఇటువంటి ప్రయత్నం ప్రపంచంలోనే ఇదే తొలిసారి! ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత! నాలుగేళ్లలోనే పూర్తి చేయడం మరో ఘనత. ఆకాశం నుంచి భూమి మీదకు నీటిని తీసుకు రావడం భగీరథ యత్నం! కానీ, భువి నుంచి దివికి నీటిని ఎత్తిపోయడమే చంద్రశేఖర యత్నం! ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధించిన కొండంత విజయం!


ఏటా 80 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా.. తెలంగాణలో 199 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా ఉండనుంది. కొత్తగా కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి జిల్లాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఇక, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ కానుంది. వెరసి, తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుంది. అంటే, ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే, ఇది తెలంగాణకు వరప్రదాయిని.


మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకూ ప్రధానంగా పది ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి ఏడు!


1  మేడిగడ్డ దగ్గర బరాజ్‌ నిర్మించి, గోదావరికి అడ్డుకట్ట వేశారు. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ఆరు అంతస్తులు అంటే 21 మీటర్ల ఎత్తులోని అన్నారం బరాజ్‌లో పోశారు.

2  అన్నారం బరాజ్‌లో నిల్వ చేసిన నీటిని.. అక్కడి పంప్‌ హౌజ్‌ ద్వారా ఎత్తిపోసి 11 మీటర్ల ఎత్తులోని సుందిళ్ల బరాజ్‌కు తరలించారు.

3  సుందిళ్ల నుంచి నంది మేడారం 101 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే, దాదాపు 33 అంతస్తుల ఎత్తన్నమాట! అందుకే, తొలుత 16 మీటర్ల ఎత్తులోని ఎల్లంపల్లికి, అక్కడి నుంచి నంది మేడారానికి తీసుకొచ్చారు. ఈ నీటిని రామడుగులోని మహా బావిలో నిల్వ చేశారు.

4  రామడుగు నుంచి మిడ్‌మానేరు 87 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే, ఇక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. అంటే, వాటి మొత్తం సామర్థ్యం 13 లక్షల హెచ్‌పీ పైమాటే! ఇన్ని మెగావాట్ల మోటారును ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి! ప్రపంచంలోనూ ఒకటో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి! ఇంత బలంగా నీటిని ఎత్తిపోసి దాదాపు 29 అంతస్తుల ఎత్తులోని ఎస్సారెస్పీ వరద కాల్వలో పోశారు. అక్కడి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు.

5  మిడ్‌మానేరు నుంచి అనంతసాగర్‌ 77 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేవలం గ్రావిటీ కెనాల్‌, టన్నెళ్ల ద్వారానే నీరు 25 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ అంత ఎత్తున్న అనంతసాగర్‌కు చేరింది. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోవచ్చు. భూగర్భంలో టన్నెళ్ల ద్వారా నీటిని పంప్‌ చేసి.. అనంతసాగర్‌ వద్ద ఎత్తిపోస్తున్నారు.

6  అనంతసాగర్‌ నుంచి రంగనాయక సాగర్‌ 83 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే, ఇక్కడ 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఇంత సామర్థ్యం కలిగిన మోటార్లు కూడా దేశంలో మరోచోట లేవని చెబుతున్నారు. వాటి నుంచి ఎత్తిపోసిన నీరు రంగనాయక సాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరింది.

7  రంగనాయక సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ 144 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐదంతస్తులు కలిగిన 8 అపార్టుమెంట్లను ఒకదానిపై మరొకటి పేరిస్తే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తన్నమాట! వాస్తవంగా ఇక్కడి నుంచి తొలుత 77 మీటర్ల ఎత్తులోని మల్లన్న సాగర్‌కు తరలించాలి. కానీ, అది ఇంకా పూర్తి కాలేదు కనక.. డైవర్షన్‌ కాల్వల ద్వారా నీటిని గజ్వేల్‌ మండలం అక్కారం, మర్కుక్‌లోని పంప్‌హౌజ్‌లకు తరలించారు. 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్ల ద్వారా 52 మీటర్ల ఎత్తులోని శ్రీగిరిపల్లికి నీరు చేరింది. అక్కడి నుంచి మర్కుక్‌ సర్జ్‌పూల్‌కు చేరాయి. అక్కడి పంప్‌హౌజ్‌లో 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లు ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీరు చేరనుంది.

కేసీఆర్‌ ఫాంహౌస్‌కు 5 కి.మీ. దూరంలోనే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోనే కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ఉంది. దీంతో, అనతి కాలంలోనే సకల హంగులతో రిజర్వాయర్‌ నిర్మించేలా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంత రైతుల భూములకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు పనుల గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రచించారు. కేసీఆర్‌ మానస పుత్రికగా రిజర్వాయర్‌ను వర్ణిస్తున్నారు.

కరువు ప్రాంతానికి ప్రయోజనం

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా కరువు ప్రాంతానికి సాగునీటిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు నిర్మించిన అతి పెద్ద రిజర్వాయర్‌ ఇదే. దీని ద్వారా కరువు ప్రాంతాలైన మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌, యాదాద్రి వంటి జిల్లాలకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందుతుంది.

- హరిరాం, కాళేశ్వరం ఈఎన్‌సీ

తర్వాతి గమ్యం ఏమిటి!?

కొండపోచమ్మ రిజర్వాయర్‌ తర్వాత గోదావరి జలాలు చేరేది యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్‌, గంధమల రిజర్వాయర్లకే. ఈ మేరకు హైలెవల్‌ మెయిన్‌ కెనాల్స్‌, డిస్ట్రిబ్యూటరీల పనులు తుది దశకు చేరాయి.

లబ్ధి పొందే జిల్లాలు: 1. కరీంనగర్‌ 2. సిరిసిల్ల 3. సిద్దిపేట 4. మెదక్‌ 5. యాదాద్రి 6. నల్లగొండ 7. సంగారెడ్డి 8. జగిత్యాల 9. నిజామాబాద్‌ 10. కామారెడ్డి 11. నిర్మల్‌ 12. మేడ్చల్‌ 13. పెద్దపల్లి 14. వరంగల్‌ అర్బన్‌ 15. వరంగల్‌ రూరల్‌ 16. భూపాలపల్లి 17. మహబూబాబాద్‌ 18. ఖమ్మం 19. జనగామ 20. సూర్యాపేట

CM orders DPR forinterlinking project

CM orders DPR forinterlinking project
STAFF REPORTERVIJAYAWADA, OCTOBER 29, 2019 00:51 IST
UPDATED: OCTOBER 29, 2019 00:51 IST
SHARE ARTICLE 0PRINTA A A
Estimated cost ₹60,000 cr.; balancingreservoir at Bollapalli major component
Chief Minister Y.S. Jagan Mohan Reddy has instructed the Water Resources Department (WRD) to get a Detailed Project Report (DPR) prepared by Water and Power Consultancy Services Limited (WAPCOS) for diverting about 23,000 cusecs (2 tmcft per day) of Godavari river water from the Polavaram dam to the Banakcherla head regulator on the Srisailam right main canal as part of the linking of the Godavari and Krishna rivers. It is estimated to cost ₹60,000 crore.

According to an official release, as part of the project, the government contemplates building a balancing reservoir with a storage capacity of 150 tmcft at Bollapalli in Guntur district by lifting water at chainage km 114.50 of Nagarjuna Sagar right canal.

Additional ayacut
The interlinking project will stabilise Nagarjuna Sagar (NSP) right main canal ayacut (9.61 lakh acres), create irrigation potential for a new ayacut of about two lakh acres under NSP Phase-II in the Darsi and Kanigiri Assembly constituencies in Prakasam district, supplement Poola Subbaiah Velugonda project, KC Canal, and the Srisailam right bank canal, complex etc., and meet the drinking water requirements of Guntur and Prakasam districts.

The press release by WRD said upon studying the last 15 years’ daily gauge data of the Godavari river, it has been inferred by WAPCOS that the average number of flood days at 1,200 cubic metres per second flow (3.7 TMC) at Polavaram gauge station stood at 105, the total static lift from the Polavaram reservoir to the Banakacherla regulator was 230 m and the total power required is 2,100 MW. The length of the gravity canal is about 460 km.

Andhra government plans balancing reservoir at Bollapalli at cost of Rs 60000 crore

Andhra government plans balancing reservoir at Bollapalli at cost of Rs 60000 crore
The objective of the proposed balancing reservoir with a capacity of 150 TMCs is to divert Godavari water from Polavaram to the Banakacherla head regulator.


Published: 29th October 2019 05:47 AM  |   Last Updated: 29th October 2019 05:47 AM  |  A+A A-
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan ReddyAndhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy (File Photo |EPS)By Express News Service
VIJAYAWADA: In a step towards inter-linking of Krishna-Godavari basins, the YSRC government has decided to construct a balancing reservoir at Bollapalli in Guntur district at an estimated cost of Rs 60,000 crore. The objective of the proposed balancing reservoir with a capacity of 150 TMCs is to divert Godavari water from Polavaram to the Banakacherla head regulator.

As per the proposal, which came up during Chief Minister YS Jagan Mohan Reddy’s review of the water resources department on Monday, around 23,000 cusecs -- two TMC per day (210 TMC) of Godavari water in 105 days -- will be diverted from river Godavari to the Banakacherla head regulator.
Apart from stabilising irrigation water supply to 9.61 lakh acres under the Nagarjunasagar right canal ayacut, the project will irrigate two lakh acres in Kanigiri and Darsi constituencies of Prakasam district under NSP Phase- II and also cater to the drinking water needs of Prakasam and Guntur districts.
Veligonda Project, KC Canal, TGP, SRBC Complex will also be supplemented from the Banakacherla regulator, an official release said.

After studying the daily gauge data of the Godavari for the past 15 years, the WAPCOS estimated that the average flood days with the availability of 1,200 cusecs flow (3.7 TMC) at Polavaram gauge station was arrived as 105 days.

The government decided to make use of the Godavari water flowing into the sea and came up with the plan to construct a reservoir at Bollapalli.

As per the preliminary planning, Godavari water will be diverted to the Krishna through Polavaram right main canal. From there it will be diverted to Nagarjunasagar right canal and then to the proposed reservoir at Bollapalli by lifting water at ‘chainage’ KM 114.500 of Nagarjunasagar right canal.

From Bollapalli, water will be supplied to Veligonda reservoir and a tunnel will be built in Nallamala forest to take water to the Banakacherla head regulator.
Meanwhile, Jagan also underscored the need for completion of the irrigation projects on priority basis. “Notwithstanding financial constraints, we should complete the irrigation projects on a priority basis. We should be very cautious in utilisation of financial resources. First priority should be given to those projects which yield desired results immediately after completion of the works and funds should be spent on the projects accordingly,’’ Jagan opined.

Officials said that works on most of the Jalayagnam scheme of the late YS Rajasekhara Reddy government were pending due to land acquisition problems and delay in getting clearance from the forest department.

The Chief Minister went through the progress of various ongoing irrigation projects as well as those proposed to be taken up and expressed dissatisfaction over some of the reservoirs, particularly those in Rayalaseema, not being filled to the full storage level despite prolonged flood in river Krishna.
“It is sad that reservoirs are not full even though floods continued for several days. Prepare an action plan for increasing the capacity of canals carrying water to reservoirs in Rayalaseema from Srisailam project,’’ Jagan said and instructed officials to submit a detailed report for filling all the reservoirs on Krishna river within 40 days by increasing the capacity of canals.

Explaining the reasons behind some of the reservoirs not reaching the full water level, officials said against the full capacity of 12.44 TMC in Gorakallu reservoir they could fill only up to 9 TMC so far as they need forest department clearance to fill it to the full capacity. 
Similarly, Owk reservoir also needed forest clearance, and so far they could fill up to 3.3 TMC of water while its capacity is 4.15 TMC.

When the officials informed him that 5,000 cusecs of water had to be released from Telugu Ganga project to SPVB reservoir in Kadapa, only 1,300 to 2,000 cusecs is being released, Jagan asked them to prepare an action plan to rectify the problem. 

He also directed the officials to complete the relief and rehabilitation works in Velugonda, Gandikota and CBR projects and fill them to their full capacity. Earlier, the officials explained to the Chief Minister about the present condition and the water levels in the reservoirs of Krishna, Godavari and Penna basins. 

Saturday, 23 May 2020

‘Legalise Krishna water quota for greater Rayalaseema’

‘Legalise Krishna water quota for greater Rayalaseema’
SPECIAL CORRESPONDENTANANTAPUR, JULY 26, 2019 00:48 IST
UPDATED: JULY 26, 2019 00:48 IST
SHARE ARTICLE 0PRINTA A A
New pressure group discusses welfare of the region
Promising the Krishna river water for the greater Rayalaseema region, the Pattiseema and Chintalapudi lift irrigation schemes on the Godavari have been operationalised and from 2021 June the Polavaram will service the Krishna Delta region.

Thus the entire quantum of Krishna water thus saved must be immediately legalised for supply from the Srisailam through a government order, demanded a pressure group from the region.

Led by former Minister Sake Sailajanath, former MPs Mysoora Reddy, G. Prathap Reddy and former Guntakal MLA Madhusudhan Gupta, a ‘yet to be named’ pressure group for the welfare of greater Rayalaseema - the four district of Rayalaseema along with Prakasam and Nellore districts – held a meeting in Hyderabad last week on fulfilling the promise to the region while taking up the Pattiseema or the Polavaram.

At a press conference here on Thursday, Mr. Mysoora Reddy and Mr. Sailajanath said this was a non-political organisation and since the Chief Ministers of Andhra Pradesh and Telangana had a meeting on modalities of cooperation for bringing the Godavari water to Srisailam, the group took up this water sharing issue first.

Main demand
“Our demand is maintaining 885 feet full reservoir level (FRL) at Srisailam so that allocated water (on 75% dependability) saved from the Krishna Delta, hitherto served either from Prakasam Barrage or Nagarjunasagar Project, is diverted first to the HNSS, Galeru Nagari, Telugu Ganga, Veligonda, Nettampadu or SLBC. A legal framework must be created for letting the region first draw the 40 tmcft saved (due to Pattiseema or Chintalapudi lift projects) from the coming season through Pothireddypadu Head Regulator,” said Mr. Mysoora Reddy.

‘CMs should talk’
Chief Minister Y.S. Jagan Mohan Reddy and his Telangana counterpart Mr. Chandrasekhar Rao must sit together and leverage their bonhomie to arrive at a realistic formula to regulate water at the Srisailam dam as per Bachawat Tribunal allocations, said Mr. Reddy. Power generation must be done only if there was water flow above 885 feet so that the need of the region was first met, said Mr. Sailajanath.

Telangana quota
The allocation to Telangana through its Kalwakurthy and Nettampadu also could be met and another 80 tmcft Krishna water saved from the time the Polavaram dam got operationalised.

Steps should be taken to serve the Godavari water through NSP Left and Right Canals so that there was no dependence on the Krishna water downstream of the Nagarjunasagar Project, they added.

It was up to Telangana if wanted to take up the Dummugudem project from the tail-end pond of the Nagarjunasagar - a project started in combined Andhra Pradesh, but stopped after division of the State, he said.

గోదావరి–కావేరీ నదుల అనుసంధానం - నితిన్ గడ్కరీ

గోదావరి కావేరి

గోదావరి–కావేరీ నదుల అనుసంధానం
Nov 24, 2017, 02:09 IST
Centre plans to transfer surplus Godavari water to Cauvery river: Nitin Gadkari - Sakshi
ప్రణాళిక రూపకల్పనకు రాష్ట్రాల సీఎంలతో సమావేశం

చెన్నై–బెంగళూరు మధ్య రూ.20వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌ వే: గడ్కారీ

చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు.


ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు. 

మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్‌ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్‌ డ్యాంకు తరలిస్తాం.

అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్‌పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్‌ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై–  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్స్‌ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.