కృష్ణా జలాల్లో మాకు 64.75 టిఎంసిలు దక్కాల్సిందే - కర్ణాటక
Irrigation Projects
Wednesday, 24 September 2025
Sunday, 13 July 2025
3 BHK House Plan
3 BHK House Plan
Generate
a floor plan image (2D sketch).
for a
Ground and Two-floor Building
A. Requirement
Ground
Floor
1. Staircase and
Lift
2. Car
Parking for 4 cars
3. Workers' living
room
4. Bathroom for
workers and Drivers
First
and Second floors
5. Bedrooms
: Three bedrooms, all with attached bathrooms. 12’X 15’ Master Bedroom in the
South West corner and 12’X12’ Two Bedrooms
2. Kitchen
: Spacious one in the South East corner.
3. Bath
Rooms : Three Regular Bath Rooms with Commode, Wash basin, steam Bath cabin.
and a Dressing table.
4.
Dining Hall
5. Living
Room
6. Guest
Wash room – one.
7. Dish
Wash Place
8. Cloth
Wash Place
9. Walking
corridor
Optional
Additions:
10. : 4' x 6', near Living/Dining (preferably North-East corner)
11. : Front side, connected to the Living room or Bedroom
12. Skylight/Ventilation
Shafts: In inner bath areas or the center of the home
B. Detailed Plan for
G+2 Floors 3 BHK Houses
Laid out
according to Vastu principles and
functional modern living.
The
design assumes a plot of approximately 40 ft x 60 ft (2400
sq ft / 267 sq. yards), with two floors (Ground + First and Second Floor):
C. Ground
Floor Layout
1. Car Parking Area
· Size:
20 x 20' (fits 4 cars comfortably)
· Location:
North-West or North-East side for easy road access
·
2. Worker/Driver Room with Toilet
· Size:
8' x 10'
· Attached
toilet (3' x 6')
· Location:
Near parking, but separate entry
·
3. Staircase and Lift
· Staircase:
Internal with storage beneath
· Lift:
Adjacent to the stairway for accessibility
· Location:
Near the center or the North-West of the plot
D. First
Floor Layout (Main Residence)
1. Master Bedroom (South-West Corner)
· Size:
12' x 15' with Clothing cupboard
· Attached
Bath: 8' x 6'
Bath Room
Features: Dressing table, Steam bath, Commode, Wash basin
2. Bedroom 2 (North-West Corner)
· Size:
12' x 12' with Clothing cupboard
· Attached
Bath: 6' x 6'
Bath Room Features: Dressing
table, Steam bath, Commode, Wash basin
3. Bedroom 3 (North-East Corner)
· Size:
12' x 12' with Clothing cupboard
· Attached
Bath: 6' x 6'
Bath Room Features: Dressing
table, Steam bath, Commode, Wash basin
4. Living Room
· Size:
~15' x 18'
· Location:
Center-North or East
· Features:
Large windows, TV unit, and comfortable seating
5. Dining Hall
· Size:
10' x 12'
· Location:
Between the kitchen and living room
6. Kitchen (South-East Corner)
· Size:
10' x 12'
· Features:
L-shaped counter, ventilation, storage
7. Dish Wash Area
· Size:
5' x 8'
· Location:
Outside kitchen, enclosed or semi-open
8. Cloth Wash & Utility Area
· Size:
6' x 8'
· Location:
Near the back exit or beside the bathrooms
9. Guest Wash Room
· Size:
5' x 6'
· Location:
Common access, near the living room
10. Walking Corridor
· 3'
to 4' wide passages connecting rooms
E.
Optional Additions:
· : 4' x 6', near Living/Dining (preferably North-East corner)
· : Front side, connected to the Living room or Bedroom
· Skylight/Ventilation
Shafts: In inner bath areas or the center of the home
F. Second
Floor Layout (Main Residence)
1. Master Bedroom (South-West Corner)
· Size:
12' x 15' with Clothing cupboard
· Attached
Bath: 8' x 6'
Bath Room
Features: Dressing table, Steam bath, Commode, Wash basin
2. Bedroom 2 (North-West Corner)
· Size:
12' x 12' with Clothing cupboard
· Attached
Bath: 6' x 6'
3. Bedroom 3 (North-East Corner)
· Size:
12' x 12' with Clothing cupboard
· Attached
Bath: 6' x 6'
4. Living Room
· Size:
~15' x 18'
· Location:
Center-North or East
· Features:
Large windows, TV unit, and comfortable seating
5. Dining Hall
· Size:
10' x 12'
· Location:
Between the kitchen and living room
6. Kitchen (South-East Corner)
· Size:
10' x 12'
· Features:
L-shaped counter, ventilation, storage
7. Dish Wash Area
· Size:
5' x 8'
· Location:
Outside kitchen, enclosed or semi-open
8. Cloth Wash & Utility Area
· Size:
6' x 8'
· Location:
Near the back exit or beside the bathrooms
9. Guest Wash Room
· Size:
5' x 6'
· Location:
Common access, near the living room
10. Walking Corridor
· 3'
to 4' wide passages connecting rooms
G.
Optional Additions:
· : 4' x 6', near Living/Dining (preferably North-East corner)
· : Front side, connected to the Living room or Bedroom
· : In inner bath areas or the center of the home
H. Orientation
and Flow (Vastu-based)
Area
Direction
a. Master
Bedroom South-West
b. Kitchen
South-East
c. Living
Room
North or East
d. Guest
Wash Room North-West
e. Car
Parking
North-West
f. Staircase
+ Lift North-West/Centre
g. Dining
Room East/Central
Monday, 7 July 2025
Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా
Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:34 AM
పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పది సంవత్సరాలలో మూడేళ్ళు మాత్రం కృష్ణాజలాలు పారటానికి అవకాశమున్న హంద్రీ–నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. కనుక గోదావరి జలాల మళ్ళింపు ఉత్తమ మార్గం.
Video Player is loading.This is a modal window.The media could not be loaded, either because the server or network failed or because the format is not supported.Unibots.com
ABN ఛానల్ ఫాలో అవ్వండి
పోలవరం-బనకచర్ల పథకంపై గత కొద్ది రోజులుగా రాజకీయ ధర్మోపన్యాసాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. చట్టబద్ధత లేని, స్వయంప్రకటిత కేటాయింపుగా 1450 టీఎంసీల గోదావరి జలాలలో తమ వాటా 1000 టీఎంసీలని తెలంగాణ చెప్పుకుంటూనే, వరద జలాలతో 80 నుంచి 90 రోజులలో పంపింగ్ జరిగే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం కలుగుతుందని చాటించుకుంటున్నారు. 2016లో జరిగిన గోదావరి జల యాజమాన్య బోర్డు మీటింగులో తెలంగాణ ప్రతినిధులు గోదావరి జలాలు ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరగలేదనీ, రాష్ట్రాల మధ్య పరస్పర ఒడంబడిక ద్వారా గానీ, ట్రైబ్యునల్ నిర్ణయం ద్వారా గానీ కేటాయింపులు జరగాలని చెప్పారు. అయితే ఈ రెండూ జరగలేదు. కానీ తమ వాటా 1000 టీఎంసీలనీ, (ఇంతకు ముందు ప్రభుత్వం 945 టీఎంసీలుగా చెప్పింది) ఆంధ్రప్రదేశ్ వరద జలాలు కూడా ముట్టుకోవడానికి వీలులేదనీ దబాయిస్తున్నారు. ఇటువంటి దబాయింపులు గత పదకొండేళ్ళుగా వింటూనే ఉన్నాం. గోదావరి ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఏ రాష్ట్రమయినా వారి వాటా జలాలను ఇంకొక బేసిన్‌కి తరలించుకోవచ్చు. చట్టబద్ధమయిన కేటాయింపులు లేని నికర జలాల ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం వరద జలాలతో కూడా ప్రాజెక్టులు నిర్మించకూడదు. కొందరు తెలంగాణ నాయకులయితే మళ్లించిన గోదావరి జలాలకు సమానంగా వారికి కృష్ణా జలాలు సమర్పించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు.
తెలంగాణతో బనకచర్ల ప్రాజెక్టు వివాదాల్ని పక్కన పెట్టి, ఆ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి పరిశీలిద్దాం. రాయలసీమ ప్రాజెక్టులయిన హంద్రీ–నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండలకు గోదావరి నీటి సరఫరాకు ఉద్దేశించిన పథకం పోలవరం–బనకచర్ల. ఈ ప్రాజెక్టులు బచావత్ ట్రైబ్యునల్ కల్పించిన మిగులు జలాల వినియోగానికి ఉద్దేశించినవి. కానీ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్–2 తీర్పు తరువాత ఈ వెసులుబాటుకు ఆటంకం కలిగింది. ఈ తీర్పు ఇంతవరకు అమలులోకి రానందున పాత పద్ధతే కొనసాగుతోంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్–1 తీర్పులో ఒక రాష్ట్రం తమ వాటాని రాష్ట్రంలో ఎక్కడయినా వాడుకోవటానికి వీలు కల్పించింది.
విభజన చట్టం–2014లో షెడ్యూల్ పదకొండు, ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న నీటి వినియోగం కొనసాగుతుందని చెప్పింది. ఇప్పుడు నడుస్తున్న ట్రైబ్యునల్–2 ఎక్స్‌టెన్షన్ ఇరు రాష్ట్రాల మధ్య వారి వారి ప్రాజెక్టులకి నిర్దిష్ట కేటాయింపు లేకపోతే, ఆ పరిమాణాలని కూడా నిర్ణయించి, ఆపరేషన్ ప్రొటోకాల్ నిశ్చయించాల్సి ఉంది. 2013లో ఇదే ట్రైబ్యునల్–2 ఈ ప్రాజెక్టులకి కేటాయింపులు చేయకపోగా, సగటు నీటి లభ్యత వరకు (2578 టీఎంసీలు) అన్ని రాష్ట్రాలకి కేటాయింపులు చేసేసింది. కనుక ప్రస్తుత ట్రైబ్యునల్–2 ఎక్స్‌టెన్షన్ ఒకవేళ చేస్తే ఈ 2578 టీఎంసీలకు అధికంగా లభ్యమయ్యే నీటిని వాడుకోవచ్చు అని అనవచ్చేమో? లేదా అసలు వీలు కాదని చెప్పినా చెప్పవచ్చు. ఈ 2578 టీఎంసీల కంటే అధికంగా లభ్యమయ్యే నీటికి తెలంగాణ కూడా పోటీదారు(విభజన చట్టం షెడ్యూల్ 11లో కల్వకుర్తి, నెట్టెంపాడు కూడా ఉన్నాయి). అంతేకాదు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ అన్నీ ఆయా రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. ముందు ముందు ఇవి కృష్ణా యాజమాన్య బోర్డు ఆధీనంలోకి వెడతాయి. అప్పుడు, ఇప్పుడున్న వెసులుబాటు కూడా ఉండదు. పైగా మిగులు నీటిని (2578 టీఎంసీల కంటే ఎక్కువగా లభ్యమయ్యే) ఆరు ప్రాజెక్టులకి పంచాలి. ఒకవేళ ట్రైబ్యునల్ ప్రాధాన్యక్రమం నిర్ణయించకపోతే, అనుక్షణం జగడం జరుగుతుంది. వరద ఎంత కాలం లభ్యమవుతుందో కూడా ఒక సందిగ్ధమే కనుక, రాయలసీమ ప్రాజెక్టులయిన హంద్రి–నీవా, గాలేరు–నగరిలకు నీటి సరఫరా ఒక అనిశ్చితిగా ఉంటుంది. తెలుగు గంగ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్–2 సరాసరి నీటి లభ్యత ఆధారంగా 25 టీఎంసీలు కేటాయించినా (ప్రాజెక్టు రూపకల్పన 29 టీఎంసీలకి జరిగింది), ఈ కాలువ ద్వారా చిత్తూరు జిల్లాలో అదనపు ఆయకట్టుకు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పది సంవత్సరాలలో మూడేళ్ళు మాత్రం కృష్ణాజలాలు పారటానికి అవకాశమున్న ఈ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. కనుక గోదావరి జలాల మళ్ళింపు ఉత్తమ మార్గం. ఒకవేళ మళ్ళించకపోతే నష్టపోయేది రాయలసీమే, అదీగాక, ప్రస్తుతం రాష్ట్రం మొత్తం వాటాలో కొంత నీటిని ఎక్కడయినా వాడుకునే వెసులుబాటు కూడా రద్దవుతుంది. ఎందుకంటే ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ణయించినప్పుడు, వేరే చోట ఆ నీటిని వాడలేరు, అప్పుడు బోర్డు చేతులు కూడా కట్టివేసినట్టు అవుతుంది. సోమశిల, కండలేరు రిజర్వాయర్లను గత కొద్ది సంవత్సరాలుగా కృష్ణా జలాలతో గండికోట ప్రాజెక్టు ద్వారా అదనంగా నింపుతున్నారు. గోదావరి జలాల మళ్ళింపు తర్వాత కూడా ఆ జలాలతోనే వాటిని బనకచర్ల–గండికోట ద్వారానే నింపటం ఉత్తమం.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుని తెలంగాణ వారి కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చి అవినీతి జరగవచ్చని సంకోచం వెలిబుచ్చుతున్నారు. అవినీతి అంశం వదిలేస్తే– పెట్టుబడి పరిమాణం, చేపట్టవలసిన నిర్మాణ స్థూలత్వం గమనిస్తే, బహుశ ఆ పోలిక సమర్థనీయం కావచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మితమైన టన్నెళ్ళు, భూగర్భ పంపుహౌస్‌లు, కాలువలు, చెరువులు గణనీయంగా ప్రశంసించదగినవే. బారేజ్‌లలో తప్పిదాలు జరిగాయి కాని, సమగ్రంగా అది ఒక మెగా ప్రాజెక్టు. బారేజ్‌లు దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నా, తక్కువ రోజుల పంపింగ్‌తో వరదల సమయంలో పాక్షిక లాభాలు పొందవచ్చు. దశాబ్దాల క్రితంలా కాకుండా ఇప్పుడు ప్రాజెక్టులన్నీ మెగా పరిమాణంలోనే ఉంటున్నాయి. జాతీయ రహదారుల విస్తరణ, కొత్త బాటల నిర్మాణాలు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వంటివి తలచుకుంటే సాధించగలమని చెబుతున్నాయి. సరైన సంకల్పంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు కూడా నిర్ణీత సమయంలో అలా నిర్మించవచ్చు.
- కురుమద్దాలి వెంకటసుబ్బారావు
విశ్రాంత చీఫ్ ఇంజనీర్
Updated Date - Jul 08 , 2025 | 01:34 AM
Thursday, 3 July 2025
Answer on Polavaram - Banakacharla Link Project (PBLP)
Answer on Polavaram - Banakacharla Link Project (PBLP)
బనకచర్ల మీద - జవాబు చెప్పండి
Central Govt: జవాబు చెప్పండి
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:34 AM
బనకచర్లపై కేంద్ర జలసంఘం లేఖ
వరద జలాలంటే ఏంటి?.. వాటినెలా లెక్కిస్తారు?
ప్రాజెక్టులవారీగా నీటి వినియోగం, సాగునీటి వివరాలు సమర్పించండి
జలాశయాల నుంచి నీటి విడుదల లెక్కలు కూడా
ఏపీలో ప్రస్తుత, నిర్మాణ, ప్రతిపాదిత ప్రాజెక్టుల మ్యాప్ సైతం ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టీకరణ
జవాబులపై వ్యాప్కో్‌సతో కలిసి అధికారుల కసరత్తు
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పలు వివరాలు, గణాంకాలు సమర్పించాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరింది. వరద జలాల ఆధారంగా ఈ పథకాన్ని తలపెట్టినందున.. అసలు వరద జలాల నిర్వచనమేంటో చెప్పాలని, వాటిని ఎలా లెక్కిస్తారో వివరించాలని రాష్ట్రానికి సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్)ను రాష్ట్రప్రభుత్వం మే 26న జలసంఘానికి నివేదించిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించిన జలసంఘం.. తన పరిశీలనలు, అభిప్రాయాలతో ప్రాథమిక నివేదికను నాలుగు రోజుల కిందట (గత నెల 30న) రాష్ట్రానికి పంపింది. అదే రోజు కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఢిల్లీలో ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేసి ప్రతిపాదనను వెనక్కి పంపడం గమనార్హం.
గోదావరికి వరద సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్న సంగతి తెలిసిందే. అసలింత వరద ఉందా.. ఈ ప్రాజెక్టు గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారమే ఉందా? అని జలసంఘం ప్రశ్నించడం గమనార్హం, అటు ఈఏసీ, ఇటు జలసంఘం లేవనెత్తిన సందేహాలు, అడిగిన వివరణలకు సమాధానాలు ఇచ్చేందుకు.. అన్ని రాష్ట్రాల డేటా కలిగి ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కో్‌స తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ లోతుగా కసరత్తు చేస్తోంది.
రాష్ట్రాన్ని జలసంఘం అడిగిన డేటా ఇదీ
ఇంద్రావతి, శబరి, దిగువ గోదావరి సబ్‌బేసిన్లలో మిగులుజలాలు అందుబాటులో లేవని సాధ్యాసాధ్యాల నివేదికలో అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని జలవనరుల ప్రాజెక్టులు.. అనుమతులు ఉన్నవి, లేనివీ.. పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలు, ప్రతిపాదిత నీటి వినియోగం గణాంకాలు సమర్పించాలి. ఎంత నీటి అందుబాటుతో ఈ ప్రాజెక్టులు తలపెట్టారో కూడా తెలియజేయాలి.
రాష్ట్రంలో ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేసే ఇండెక్స్ మ్యాప్‌లు సమర్పించాలి. సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల రూపకల్పన మార్గదర్శకాల (2010) ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టును పరిశీలించాలంటే.. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన విధంగా 75 శాతం నీటి డిపెండబిలిటీ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్ర సహా బేసిన్ రాష్ట్రాలకు గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులు, ప్రాజెక్టులవారీ వినియోగాన్ని లెక్కించాక.. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి 200 టీఎంసీల వరద జలాల మళ్లింపునకు ఎంత డిపెండబిలిటీ ఉందో లెక్కించి చెప్పాలి.
అధికారులు సమర్పించిన ఎక్సెల్ షీట్‌లో ఎలాంటి ఫార్ములాలు గానీ, గణాంక విధానాలు గానీ లేవు. వాటన్నిటినీ సమర్పించాలి.
ప్రాజెక్టులవారీగా నీటి వినియోగం డేటా, సాగు ప్రాంతం, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల రికార్డుల గణాంకాలను మాకు పంపాలి.
గోదావరి ట్రైబ్యునల్ అవార్డు కేటాయింపులను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, తెలంగాణ, ఏపీ పూర్తిగా వాడుకున్నట్లు నివేదికలో తెలిపారు. ఆ కేటాయింపుల వినియోగం వివరాలు కూడా మాకు సమర్పించండి.
పోలవరం డ్యాం నుంచి వరద జలాలను.. పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా రోజుకు 18 వేల క్యూసెక్కుల (510 క్యూమెక్కులు) చొప్పున కృష్ణా నది (ప్రకాశం బ్యారేజీ)లోకి తరలిస్తామని నివేదికలో పేర్కొన్నారు. అయితే వరద జలాలను ఎలా లెక్కిస్తారు.. ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు.. ట్రైబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే అవి ఉన్నాయా అనే వివరాలను మాకు పంపండి.
రోజుకు 18 వేల క్యూసెక్కుల చొప్పున 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలంటే.. 129 రోజుల సమయం పడుతుంది. మరి ఇన్ని రోజులు వరద అందుబాటులో ఉంటుందో లేదో.. పోలవరం వద్ద వరద నీటి విడుదల లెక్కల ఆధారంగా తాజా సర్వే చేపట్టాలి. ట్రైబ్యునల్ అవార్డును పరిగణనలోకి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలి.
సమర్థ జవాబుల కోసం కసరత్తు
పోలవరం-బనకచర్లపై జలసంఘం, ఈఏసీ గంటల వ్యవధిలోనే కొర్రీలు వేయడంతో.. వాటి సందేహాలకు సమర్థంగా సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. వాప్కో్‌సతో కలసి ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల ఏడో తేదీనాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని యోచిస్తోంది. వివరాలన్నీ సిద్ధమయ్యాక.. సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఢిల్లీ పంపి.. సమగ్ర సమాచారాన్ని వ్యక్తిగతంగా జలసంఘానికి సమర్పించాలని నిర్ణయించింది.
Updated Date - Jul 04 , 2025 | 02:37 AM
Banakacherla project hits roadblock as Central panel returns the proposal
Sources told TNIE that the water resources department is discussing the issue at length and would respond at the earliest.
Polavaram project.
Polavaram project.File Photo | Express, Prasant Madugula
S Guru Srikanth
Updated on:
01 Jul 2025, 9:01 am
2 min read
Follow Us
VIJAYAWADA: The Central Environment Expert Appraisal Committee (EAC) for River Valley and Hydroelectric Projects has declined approval for Andhra Pradesh’s Polavaram-Banakacherla Link Project (PBLP), citing legal and environmental issues.
The decision was taken after its 33rd meeting on June 17, 2025. and communicated to the State on Monday (June 30).
The committee has returned the PBLP proposal to Andhra Pradesh for clarification, underscoring the need for compliance with tribunal rulings and interstate agreements.
Chaired by G K Chakrapani, the EAC emphasized that any clearance would require a review of the 1980 Godavari Water Disputes Tribunal (GWDT) verdict and consultations with the Central Water Commission (CWC).
Sources told TNIE that the water resources department is discussing the issue at length and would respond at the earliest.
It should be noted here that in his recent media conference, Minister for Water Resources Nimmala Ramanaidu expressed confidence that PBLP would get the nod for environmental clearance.
The PBLP, proposed by Andhra Pradesh’s Water Resource Department, sought Terms of Reference (TOR) for a 376-km canal system to transfer 200 TMC of floodwater from Polavaram Dam to Banakacherla Regulator across eight districts: East Godavari, West Godavari, Eluru, Krishna, NTR, Palnadu, Prakasam, and Nandyal.
ADVERTISEMENT
Resolve interstate disputes via CWC: EAC to govt
Costing Rs 81,900 crore, the project aims to irrigate 3 lakh hectares, stabilize 9.14 lakh hectares, provide drinking water to 80 lakh people, and supply 20 TMC for industrial use.
It includes two 200 MW hydropower stations, a 19.5 km tunnel through the Nagarjuna Sagar-Srisailam Tiger Reserve, 17.28 km of pipelines, and 9 pumphouses, requiring 24,064 hectares, including 1,717 hectares of forest land.
During the virtual meeting on June 17, the EAC reviewed objections from Odisha and Chhattisgarh, highlighting potential flooding and GWDT violations. The panel recommended a comprehensive floodwater assessment and urged Andhra Pradesh to resolve interstate disputes through the CWC, alongside addressing environmental impact assessments (EIA) and TOR requirements.
The EAC also drew on the updated Cumulative Impact Assessment and Carrying Capacity Study (CIA&CCS) for the Yamuna River Basin, presented by ICFRE on July 18-19, 2024.
The study’s robust data on river cross-sections, biodiversity, and environmental flows set a benchmark for evaluating projects like PBLP, particularly concerning the tiger reserve tunnel, which requires further scrutiny to ensure minimal ecological impact.
WAPCOS
Water and Power
WAPCOS (Water and Power Consultancy Services (India) Limited) is extending its reach and services, as indicated by recent corrigenda and tender documents. These extensions involve adjustments to bid submission deadlines and scope of work for various projects across different divisions.
WAPCOS is a central public sector enterprise wholly owned by the Government of India (“GOI”) under the administrative control of the Ministry of Jal Shakti, GOI.
Wednesday, 18 June 2025
CM Revanth Reddy on Banakacharla
CM Revanth Reddy on Banakacharla
బనకచర్ల పాపం కేసిఆర్ దే
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:49 AM
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్లం. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆర్ కాదా? ఇదే అవకాశంగా తీసుకుని కృష్ణా బేసిన్ కొల్లగొట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్‌కు వచ్చారు. కేసీఆర్.. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటి?
తెలంగాణకు తీరని ద్రోహం చేశారు
2016, 2019లో చంద్రబాబు, జగన్‌తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గం సుగమం చేశారు
రాయలసీమను రతనాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీనిచ్చారు
ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడట్లేదంటూ మాపై బురద!
ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావుదే
తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి
మోదీ వద్ద పలుకుబడి ఉన్నా బాబుకు అనుమతులు భ్రమే
‘గోదావరి-బనకచర్ల’పై మీడియాతో సీఎం రేవంత్
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు బుఽధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్.. భేటీ ముగిశాక సచివాలయంలోనే ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే.. ఆ విషయంలో శిక్షించి, ఉరి తీయాల్సింది కేసీఆర్, హరీశ్‌రావునేనని ధ్వజమెత్తారు. వారు ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని.. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వపాపాలు చేసి, పాపాల భైరవులుగా మారి రాష్ట్రానికి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. వారే ఇప్పుడు.. ‘బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ మాట్లాడట్లేదు’ అంటూ తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వెంటనే తాము కేంద్ర మంత్రిని కలిసి.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్ని వివరాలనూ తెలిపామని సీఎం చెప్పారు. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రితోనూ చర్చించామని.. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ లేఖలు రాశారని గుర్తుచేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించడం వెనుక రాజకీయ ప్రేరేపిత అంశాలేవీ లేవన్న సీఎం.. భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికలపై ప్రతిపక్షాలను సూచనలు అడిగినట్టు తెలిపారు. రాజకీయ అంశాలకు అవకాశం ఇవ్వకూడదని భావించే.. ఈ భేటీకి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించామన్నారు.
ఆ సమావేశంలో చర్చించిన పలు విషయాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జలశక్తిభవన్, న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఆందులో అప్పటి సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆ సమావేశంలో గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణాలపై, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. 8 పేజీలతో సమావేశం వివరాలను నమోదుచేశారు. అందులో 6వ పేజీలోని రెండో పేరాలో పేర్కొన్న దాని ప్రకారం ‘‘గోదావరి జలాల్లో 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో నిర్మించుకునే ప్రాజెక్టులకు 1000 టీఎంసీల అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చ’’ని పేర్కొన్నారు. అంటే గోదావరిలో 3వేల టీఎంసీలు వృధా అవుతున్నాయి, వాటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించి తద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే విషయానికి పునాది పడింది అప్పుడే. ఇది అధికారిక సమావేశంలో చెప్పిన విషయం. ఈ విషయం అప్పటి మంత్రి హరీశ్‌కు తెలియదనడం కరెక్ట్‌కాదు. ఈ వివరాలను హరీశ్‌కు పంపుతా’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత.. కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఉన్న వైరాలు, అంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నారు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయ్యాక.. తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. వారిద్దరూ 2019 జూన్ 28, ఆగస్టు, సెప్టెంబరు, మళ్లీ ఆ తరువాత ఏడాది ఆగస్టు నెలల్లో.. మొత్తం నాలుగు సార్లు భేటీ అయ్యారని, ఆ సమావేశాల్లోనే జలబంధం ఏర్పడిందని రేవంత్ వ్యాఖ్యానించారు. అప్పట్లో కేసీఆర్ సొంత పత్రికలో ప్రచురించిన పలు కథనాలను సీఎం విలేకరుల సమావేశంలో చూపించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం ద్వారా ‘నష్టం తక్కువ లాభం ఎక్కువ’ శీర్షికన ప్రచురితమైన కథనాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కేసీఆర్ వలనే బనకచర్ల..
ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకెళ్తున్నారని రేవంత్ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక.. అప్పటి మంత్రి రోజా ఇంటిదగ్గర కేసీఆర్ ఏం మాట్లాడారో కూడా అందరూ చూశారని పేర్కొన్నారు. ‘‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. కలిసి పనిచేస్తాం. సమర్థమైన సీఎంగా జగన్ ఉన్నారు. నేను పెద్దన్నగా పూర్తిగా సహకరిస్తా. రాయలసీమను రతనాలసీమగా చేస్తా’’ అని కేసీఆర్ అప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. శాసనసభలో, వివిధ సందర్భాల్లో.. గోదావరి జలాలను పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి, ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి, ప్రోత్సహించిందే కేసీఆర్, హరీశ్ అని సీఎం దుయ్యబట్టారు. చంద్రబాబు గోదావరి జలాలను బనకచర్ల వరకూ తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించారని.. పరోక్షంగా మరో 100 టీఎంసీలను కలిపి మొత్తం 300 టీఎంసీల ప్రాజెక్టుకు సివిల్ వర్క్‌లు పూర్తి చేస్తున్నారని రేవంత్ తెలిపారు. గతంలో చర్చల సందర్భంగా కేసీఆర్.. 400 టీఎంసీల తరలింపునకు ప్రతిపాదన ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ప్రతిపాదనల ప్రకారమే చంద్రబాబు వ్యవహరిస్తే.. మొత్తం 400 టీఎంసీలను తీసుకెళ్లినా ఆఽశ్చర్యం లేదన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు గురించి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడగానే వెంటనే సాగునీటి మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న తమపై హరీశ్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అలా అనుకుంటే పొరపాటే..
‘‘చంద్రబాబు నాయుడుకు సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే’’ అని సీఎం రేవంత్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమకు భేషజాలు లేవని.. అందరినీ కలిసి సమస్యను వివరిస్తామని.. అప్పటికీ న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. ‘‘గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే.. 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలి’’ అన్నారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక.. ఏపీ ఏ నీరు వాడుకున్నా తమకేమీ అభ్యంతరం ఉండదన్నారు. ‘‘చంద్రబాబు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు. కృష్ణా గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక.. మిగిలిన నీరు మీరు ఎలాగైనా వాడుకోండి’’ అని వ్యాఖ్యానించారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలను వివరిస్తామన్న సీఎం.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘అఖిల పక్ష భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పిలిస్తే సమయం లేదన్న ఆయన.. బుధవారం సాయంత్రం జలశక్తి మంత్రిని ఎలా కలిశారో.. ఎందుకు ముందే కలిశారో.. ఆ రహస్యాలను ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రేపు మేం కలుస్తామని తెలిసి, ఇవాళ వెళ్లి కలవడం వెనుక ఏం కుట్ర ఉందో? అఖిలపక్ష సమావేశానికి రాకుండా ముందుగానే జలశక్తి మంత్రిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ధ్వజమెత్తారు. చట్టప్రకారం గోదావరి జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించుకునేందుకు బోర్డు ఉందని, సీఎం స్థాయి వరకూ కమిటీలు ఉన్నాయని.. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. అలాంటి బోర్డుకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండానే.. కేంద్రంలో పలుకుబడి ఉందని నేరుగా పై నుంచి కిందకు అనుమతులు తీసుకొస్తామంటే వీలుకాదని వ్యాఖ్యానించారు. ‘‘బోర్డు అనుమతించాక. పర్యావరణ శాఖ మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలవాలి. అలా కాకుండా పైనుంచే కిందకు అనుమతులు తెస్తామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. మేం అభ్యంతరాలను వ్యక్తం చేయడం వల్లనే ఇవాళ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడుతామని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు. ఇందులో ఎలాంటి శషభిషలూ లేవన్నారు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ప్రస్తుతం తాము మొదటి అంకంలో ఉన్నామన్నారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ముందుగానే న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. కోర్టు వినదన్నారు. కాగా.. గత పాలనలో పదేళ్ల కాలంలో 96 క్యాబినెట్ సమావేశాలు జరిగాయని.. కానీ, ఒక్క భేటీలో కూడా కాళేశ్వరం అనుమతులపై చర్చ జరగలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో అంచనాలు పెంచుకునేందుకు మాత్రమే అనుమతులు తీసుకోవడంపై చర్చించారని తెలిపారు.
తల ఎక్కడ పెట్టుకుంటావ్ హరీశ్..
హరీశ్‌రావుకు వయసు మీద పడిందని, ఆయన ఇంకా చిన్నపిల్లవాడు కాదని.. ఇకనైనా చిల్లర పనులు మానుకోవాలని సీఎం రేవంత్ హితవు పలికారు. ప్రాజెక్టుల విషయంలో అన్ని అంశాలనూ తాము బహిర్గతం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు హరీశ్ తన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘‘జీవితాంతం, కుటుంబం అంతా అబద్ధాలు చెప్పుకొంటూనే బ్రతుకుతారా?’’ అని నిలదీశారు. ‘‘కడుపునొప్పికి మందు ఉంది కానీ.. హరీశ్‌రావు అసూయకు మందు లేదు.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు కాళేశ్వరం అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ, నిజాలు నిప్పులాంటివి. అన్నీ బయటకు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవయవదానం చేసి.. ఆ పార్టీకి చెందిన 8 మంది అభ్యర్థులు గెలిచేలా బీఆర్‌ఎస్ పని చేసిందని.. అందుకే, హరీశ్ అబద్ధాలు చెబుతుంటే.. కిషన్‌రెడ్డి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని రేవంత్ విమర్శించారు. బుధవారం భేటీకి.. దామోదర్‌రావు, సురే్‌షరెడ్డి రాలేదని, అమాయకుడు వద్దిరాజు రవిచంద్రని పంపారని అన్నారు. ఆయన కూడా తనకు ఇచ్చిన కాగితంలో ఉన్నవాటినే చదివారని.. తాను కొన్ని విషయాలను లేవనెత్తగానే వెళ్లిపోయారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్‌లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, ప్రమాదంలో మరణించిన పేదలకు పంచిపెడతారేమోనని 18 నెలల నుంచి చూస్తున్నానని.. కానీ పదిపైసలు కూడా ఇవ్వలేదన్నారు. కాగా.. రాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంపై కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను సీఎం రేవంత్ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.
ఆ సూత్రం బనకచర్లకూ వర్తిస్తుంది
ఏపీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా 45 టీఎంసీల కృష్ణా జలాలు మనకు రావాల్సి ఉంటుందని.. అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ గుర్తుచేశారు. అదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకూ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి-బనకచర్లను 200 టీఎంసీల తరలింపు కోసంచేపడుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలు 300టీఎంసీలకు సరిపడా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో 120 రోజుల పాటు నీటిని తరలించడానికి అవసరమైన ఏరాట్లు చేస్తున్నారని తెలిపారు. గోదావరి జలాల తరలింపుపై కేసీఆర్ గతంలో అన్న మాటల గురించి సీఎం ప్రస్తావించినప్పుడు.. బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని.. ‘దీనిపై రాజకీయం వద్దు’ అన్నారు. దీనికి సీఎం.. తాను రాజకీయ అంశాలు ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు. గోదావరి జలాలను శ్రీశైలానికి, అక్కడి నుంచి రాయలసీమకు అందించాలనేదే కేసీఆర్ ఉద్దేశమని అన్నారు. దాంతో వద్దిరాజు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఆయన బయటకు వెళుతుండగా.. మిగిలిన ఎంపీలు సముదాయించడానికి ప్రయత్నించారు. అప్పుడు సీఎం జోక్యం చేసుకుని.. ‘వెళ్లనివ్వండి... ఆయన ఇబ్బందులు ఆయనవి’ అని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తుతామన్నారు. గోదావరి -బనకచర్లకు వ్యతిరేకంగా ఎంపీలంతా కలిసి ఒక తీర్మానం చేస్తే, దాన్ని కేంద్రానికి అందిద్దామని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రం ఏర్పడ్డాకా బేసిన్ పారామీటర్, బేసిన్ వెంట నివసిస్తున్న జనాభా ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811టీఎంసీల్లో 555 టీఎంసీలను తెలంగాణకు కోరాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని.. 2021 దాకా ఈ ఒప్పందం కొనసాగిందని సీఎం మండిపడ్డారు. గోదావరి-బనకచర్లకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకెళతామని సీఎం ప్రకటించారు. ఈ సమయంలో డీకే అరుణ జోక్యం చేసుకొని... ‘ఎందుకు తమ్ముడూ (సీఎంనుద్దేశించి) ఏపీ వాళ్లు అంత స్పీడ్.. స్పీడ్‌గా పోతున్నరు’అని ప్రశ్నించగా.. ‘ఏపీ వాళ్లు అంతే అక్కా.. వాళ్లు ఉదయం 5 గంటలకు లేస్తే... మనం 11కు లేస్తాం’ అని సీఎం సరాదాగా జవాబు చెప్పారు. దాంతోసభ్యులంతా గట్టిగా నవ్వారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి, ఫిర్యాదు చేయడానికి.. సీఎం రేవంత్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి ఉత్తమ్ బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి, గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమై.. మెట్రో విస్తరణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం.. ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను రేవంత్ మర్యాదపూర్వకంగా కలవున్నారు.
Updated Date - Jun 19 , 2025 | 03:49 AM
Friday, 13 June 2025
Godavari - Cauveri (GC) Link Project
గోదావరి-కావేరీ అనుసంధానం సాధ్యమేనా?
ABN
, Publish Date - Jun 13 , 2025 | 04:42 AM
24న
హైదరాబాద్‌లో నదుల అనుసంధాన సంప్రదింపుల కమిటీ భేటీ
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి
- కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన
అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్‌లో జాతీయ నీటిఅభివృద్ధి
సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం
(సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. కేంద్రం ఇప్పటి వరకూ పోలవరం నుంచి గోదావరి-కావేరీ
అనుసంధాన ప్రాజెక్టును ఒప్పుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం న్యూఢిల్లీలో
జరిగిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధాన
ప్రక్రియ ఎంతవరకొచ్చిందని ఆరా తీసినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ
అనుసంధానం చేపట్టాలని పట్టుబట్టిన ఏపీ.. తాజాగా రూట్ మార్చి గోదావరి-బనకచర్ల అనుసంధానంలో
భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించే 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్
నుంచే ‘బొల్లాపల్లి-కావేరీ అనుసంధానం’ చేపట్టాలని కేంద్రాన్ని
కోరింది. పోలవరం విస్తరణలో భాగంగా రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు కొత్తగా
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది.
అంతటితో ఆగక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని
46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట గోదావరి-బనకచర్ల అనుసంధానానికి
నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరుతున్నది. బొల్లాపల్లి - కావేరీ అనుసంధానానికి
ఒప్పుకుంటే మాత్రం.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి
ఉంటుంది.
గోదావరి - కావేరి
నదుల అనుసంధానం
సందర్భం
గోదావరి
- కావేరి నదుల అనుసంధానం మరోసారి తెరమీదికి వచ్చింది.
ఈ
ప్రాజెక్టు మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను తెలుసుకోవడానికి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA)
జూన్ 24న హైదరాబాద్ లో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ
సమావేశానికి కేంద్ర జల వనరుల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షత వహిస్తారు.
ప్రశ్నలు :
1.
గోదావరి
- కావేరి అనుసంధానం (GC Link) ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం వుందా?
2.
ఈ
ప్రాజెక్టువల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
3.
ఈ
ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ
అభిప్రాయం ఏమిటీ?
4.
తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?
5.
పోలవరం
నుండి గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండేది.
ఇప్పుడు బొల్లాపల్లి నుండి కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరుతోంది. ఈ మార్పుకు కారణం
ఏమిటీ?
6.
గోదావరి
– బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటీ?
7.
ఏపీ
పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46 (2), 46 (3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. అలా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం వుందా?
8.
బచావత్
ట్రిబ్యూనల్ నాటికి గోదావరి నదిలో మిగులు నికర జలాలున్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితివుందా?
9.
గోదావరి
నుండి కావేరి బేసిన్ కు నికరజలాలను కేటాయిస్తారా?
10.
అలా
చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సమస్యలు ఏమిటీ?