జగన్ దొంగ దీక్షలు మానుకోవాలి : దేవినేని Updated :07-10-2015 14:41:44 |
పశ్చిమగోదావరి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ దీక్షలు మానుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దీక్షల పేరుతో విద్యార్ధులను రెచ్చగొడితే ప్రభుత్వం ఊరుకోదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేనివారితో కలిసి గ్రీన్ ట్రిబ్యునల్‌లో జగన్ కేసు వేయించారన్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ నాటికి పట్టిసీమ పథకం ద్వారా 80 టీఎంసీల నీటిని మళ్లిస్తామన్నారు. పోలవరం అంచనాలకు కేంద్రం ఆమోదం లభిస్తుందని, కొన్ని షరతులతో కాంట్రాక్టు ఏజెన్సీని కొనసాగిస్తామన్నారు. పోలవరం డయా ఫ్రం వాల్వ్ పనిని డిసెంబర్‌లో ప్రారంభిస్తామని, ఈమేరకు విదేశీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
|
No comments:
Post a Comment