Saturday 26 September 2015

పోలవరం జాతీయ ప్రాజెక్టే అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు

పోలవరం జాతీయ ప్రాజెక్టే అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు : కేంద్ర మంత్రి
Updated :24-07-2015 01:21:59
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉందా? లేదా?, దాని నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత?, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఎంత? ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చాయా? లేదా? అంటూ విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్లమెంటులో గురువారం ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సన్వర్‌లాల్‌ జత్‌ సమాధానమిచ్చారు. సెక్షన్‌ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. 2010-11 ప్రకారం రూ.16,010.45 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటివరకు దీనిపై రూ.5,575 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేంద్రం 2014-15లో రూ.250 కోట్లు, 2015-16లో రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్ట్‌కు ఎనిమిది రకాల అనుమతులు వచ్చాయన్నారు. పోలవరాన్ని మార్చి 2018 నాటికి పూర్తిచేయాల్సి వుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌కు, పోలవరానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని మే 28, 2014న ఏర్పాటుచేయగా ఇది ఈ ఏడాది జనవరి నుంచి పనిచేస్తోందని చెప్పారు. 

Indirasagar (Polavaram) Project, A.P

Indirasagar (Polavaram) Project, A.P

Background on Polavaram ( Interstate agreement)
Indirasagar Polavaram an interstate project on river Godavari has been conceived as a part of recommendations of Godavari Water Disputes Tribunal (GWDT). GWDT finalized its award in 1980 .The award identifies individual projects that can be taken up by the co-basin states of Maharashtra, Madhya Pradesh (including Chhattisgarh), Orissa, Karnataka and Andhra Pradesh (AP) on the main Godavari river as well as its tributaries. As a part of the award, the states of Andhra Pradesh, Madhya Pradesh and Orissa executed an agreement dated 02-04-1980 to enable clearance of Polavaram Project to be undertaken by AP. The agreement provides for construction of the project with a Full Reservoir Level of 150 Feet and with a spillway discharging capacity of 36 Lakh Cusecs at pond level of 140 feet and not less than 20 Lakh Cusecs at a pond level of 130 feet. In order to protect the lands and properties above level of 150 feet, in Orissa and Chhattisgarh, protective embankments with adequate drainage sluices have been provided at the cost of the project. Relevant provisions of the agreement are reproduced below.
“Polavaram project spillway shall be designed for a flood discharge capacity of 36 Lakh cusecs at the pond level of 140 feet and not less than 20 lakh cusecs at pond level of 130 feet.
In order to protect the lands and properties above 150 feet in the territory of Orissa likely to be affected due to construction of Polavaram project, protective embankments with adequate drainage sluices shall be constructed and maintained at the cost of Polavaram project. However, the state of Orissa may exercise an option at the time of construction of Polavaram project for compensation to land and property likely to be affected above 150 feet as agreed in case of state of Madhya Pradesh (now Chhattisgarh).
For damages or injury to lands beyond 150 feet in the territory of Madhya Pardesh (now Chhattisgarh), in any event, the state of Andhra Pradesh shall pay full compensation for such damage or injury as may be assessed by the District Collector of the said district of the state of Madhya Pradesh (now Chhatisgarh).
The matter of design of the dam and its operation schedule shall be left to Central Water Commission, which they shall decide keeping in view all the agreements between the parties including the agreement of 2nd April 1980 filed today, as far as practicable.”
Project in Brief
Indira Sagar (Polavaram) project is located on river Godavari near Ramayyapet village of Polavaram Mandal of West Godavari district in Andhra Pradesh. The project is multipurpose major terminal reservoir project on river Godavari for development of Irrigation, Hydropower and drinking water facilities to East Godavari, Vishakhapatnam, West Godavari and Krishna districts of Andhra Pradesh. The project will provide irrigation to 2.91 Lakh Hectares(CCA) and hydropower with installed capacity of 960 MW apart from 23.44 TMC (663.7 MCM) drinking and industrial water supply to Vishakhapatnam township and steel plant and diversion of 80 TMC waters to river Krishna. The ultimate irrigation potential of the project is 4.368 lakh ha and annual power generation will be 2369.43 million units. In addition, 540 villages will also be provided with drinking water facilities in the command area.
The project implements Godavari-Krishna link under Interlinking of rivers project. The project envisages transfer of 80TMC of surplus Godavari water to river Krishna which will be shared between AP, Karnataka and Maharashtra in proportion of 45 TMC by AP and 35 TMC by Karnataka and Maharashtra as per the decision of the GWDT award.
Status of appraisal
The project proposal of Indira Sagar (Polavaram) Project was considered and accepted by the Advisory Committee of MoWR in its meeting held on 20.01.2009 for Rs. 10151.04 crores at SOR 2005-06.
Investment clearance was accorded by Planning Commission vide their letter No. 2(168)/2004-WR dated 25 Feb. 2009.
Subsequently, Project Authorities have submitted Revised Cost Estimate of Polavaram Project on 30.08.2010. This was examined and finalized by CWC for revised cost Rs. 16010.45 crore of SOR 2010-11. Revised Cost Estimate of Polavaram Project for Rs. 16010.45 crore was accepted by the Advisory Committee of MoWR in its 108th meeting held on 04.01.2011. Investment clearance from Planning Commission is awaited. Planning Commission vide their letter no. 25(11)/NP/S/2009-WR dated 20.6.2012 addressed to Director, Prime Minister Office has intimated that Planning Commission has decided to wait for further orders of Supreme Court in the case filed by Government of Orissa against the project before taking any action as the matter is sub-judice.
Alternative Design Proposal
A proposal for  taking up a series of barrages on Godavari river prepared by Shri T. Hanumantha Rao, former Engineer-in-Chief, Andhra Pradesh and UN consultant was received in Ministry of Water Resources through Shri  P. Govardhan Reddy, Hon`ble Member of Parliament in December 2009. The series of barrages one below the other all along the river has been termed as “Step Ladder Technology” by the author.  The proposal was sent to CWC for examination. The same was examined and the main observations of CWC were as under.
 i)  Barrages are diversion structures for providing limited storage capacity during the time when water is available in the river
 ii) A barrage cannot fully meet water requirements during non-monsoon period for Rabi irrigation and other purposes like dependable power generation, diversion of water and supply of drinking water to a city.
iii) The command area under existing lift schemes is getting irrigation in Kharif only. For providing  irrigation supplies for Rabi and perennial crops as well, State government of Andhra Pradesh has taken up  Polavaram project.
Court cases
Government of Orissa has filed original Suit No. 4 of 2007 and various Interlocutory Applications (IAs) in the Hon’ble Supreme Court against clearances granted by various Central Agencies including MoWR and against proceeding with the construction of Polavaram project by Andhra Pradesh Government and making defendant no. 1 to Govt. of Andhra Pradesh, defendant no. 2 to Ministry of Water Resources (MoWR), Government of India, defendant No. 3 to Ministry of Environment and Forest (MoEF) and defendant No.4 to Ministry of Tribal Affairs (MoTA). No verdict or stay-order against the construction of Polavaram project or against declaring it National Project has been delivered by Hon'ble Supreme Court so far.
Direction of Hon’ble Supreme Court
Hon’ble Supreme Court vide its order dated 11.4.2011 has nominated Mr. M. Gopalakrishnan, Retired Member of Central Water Commission(CWC) who along with Members of CWC make inspection of Polavaram dam and submit a report to the Hon’ble Supreme Court separately to find out whether construction of  Polavaram dam is carried out in terms of GWDT Award.
Mr. M. Gopalakrishnan and Members of CWC have visited the Polavaram dam during 23-24thMay, 2011 and separately submitted their report dated 14.6.2011 to the Hon’ble Supreme Court.
In both the reports of Mr. M. Gopalakrishnan and Members of CWC, it was concluded that the planning of Polavaram project and limited construction activities seen so far by the team at the Polavaram dam site are in tune with approved project and GWDT provisions.
Government of Chhattisgarh has filed original Suit No. 3 of 2011 alongwith IA in the Hon’ble Supreme Court against clearances granted by various Central Agencies including MoWR and against proceeding with the construction of Polavaram project by Andhra Pradesh Government and making defendant no. 1 to Govt. of Andhra Pradesh, defendant no. 2(a) to Ministry of Water Resources (MoWR), Government of India, defendant No. 2(b) to Ministry of Environment and Forest (MoEF), defendant No. 2(c) to Ministry of Tribal Affairs (MoTA) and defendant no. 3 to Central Water Commission.        
Inclusion of Polavaram as National Project
State Govt. had submitted the proposal of the project for inclusion as National Project in April, 2009 as per guidelines for National Projects issued by the Ministry of Water Resources, Govt. of India.  The project was recommended by the High Powered Steering Committee for inclusion as National Project in August, 2009.  The EFC memorandum was discussed in the EFC meeting held on 5.3.2010 and it was decided that state govt. may work out realistic cost & implementation programme of the project. The cost of the project has been updated as Rs.16010.45 crore at 2010-11 price level. The revised cost of the project for Rs 16010.45 crore (Price Level 2010-11) has been accepted by the Advisory committee of MOWR in its 108th Meeting held on 4.1.2011. Investment clearance from the Planning Commission for the revised cost is awaited.
Stop work order by MoEF
Ministry of Environment & Forest (MoEF) while responding to the special mention by Dr. K.V.P. Ramchandra, M.P. in Rajya Sabha on 12th August, 2011 regarding demand to conduct public hearing for Indira Sagar Polavaram Multipurpose Project in Andhra Pradesh commented as under:
“Government of Andhra Pradesh has so far not conducted the requisite public hearings in Orissa and Chhattisgarh. Due to non compliance of this environment clearance condition, the MoEF has issued stop work order for the project on 8th February, 2011….Since public hearings in both the states are still pending, the stop work order for the project continues. A final decision in this regard shall be taken after the orders of the Hon’ble Supreme Court”.
Government of Andhra Pradesh vide its letter no. 14/ISPP/2013 dated 8.4.2013 has intimated that MoEF on the representation of Andhra Pradesh, has decided to keep the stop work order in abeyance for a period of six months during which efforts be made to get the Public Hearings done in the States of Odisha and Chhattisgarh for the protective embankments.

Polavaram project estimates raised to Rs. 7,332 cr

Polavaram project estimates raised to Rs. 7,332 cr

OUR BUREAU
COMMENT (1)   ·   PRINT   ·   T+  
The Andhra Pradesh Government has issued orders for the revision of the estimates for implementation of the Indira Sagar Polavaram multi-purpose hydel project.
The revised administrative approval for investigation, survey and preparation of the project plant and construction of spillway and works on the 960 MW hydel power unit with an outlay of Rs. 7.332 crore has been approved. The project will incorporate a 960 MW hydro electric power house.
The State Department of Irrigation and Command Area Development in an order today have accorded clearance for the revised approvals for construction of spillway of about Rs. 985.50 meters, connectivity from the reservoir to right main canal and connectivity from reservoir to left main canal of Polavaram project.
The new clearances include earth-cum rockfill dam across Godavari and the hydro electric power plant.
While the original administrative approval for the project was Rs. 4041 crore, the revised estimate is Rs.7372.22 crore. The cost differential now works out to 82.44 per cent more than the initial proposed investment estimate.
According to the approvals received through the Government order, the spillway works would entail an outlay of Rs. 2,499 crore, earth cum rock fill dam works out to Rs. 2,952 crore and the hydro electric power unit Rs. 1921 crore.
Shailendra Kumar Joshi, Principal Secretary to Andhra Pradesh Government, in the order issued today, has accorded the necessary sanctions to revise the cost estimates of the ambitious project.
(This article was published on February 6, 2013)

Thursday 24 September 2015

పట్టిసీమ ద్వారా 7.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడుతాం : దేవినేని

పట్టిసీమ ద్వారా 7.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడుతాం : దేవినేని
Updated :24-09-2015 17:02:03
విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాల తరలింపుతో కృష్ణా డెల్టాలో మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుతామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు మంచినీరివ్వడం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన విమర్శించారు. అలాగే సాగునీటి సంఘాలను పరిపుష్టి చేస్తామని, కాంగ్రెస్ హాయంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరపలేదన్నారు. దీనిద్వారా సాగునీటి సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు.

పట్టిసీమ వివాదాలు పెరుగుతున్నాయ్.

పట్టిసీమ వివాదాలు పెరుగుతున్నాయ్. 
1. పోలవరంపై దృష్టి పెట్టకుండా తాత్కాలిక ప్రజెక్టు ఎన్దుకు?
2. తాత్కాలికంగా తాటిపూడినుండి గోదావరి నీళ్ళు కృష్ణానదికి తేవచ్చని తెలిసినప్పుడు పట్టిసీమ కొత్తగా ఎందుకు?
3. అక్వడిక్టు కట్టాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని, లేకపోతే నిన్నటిలా కొట్టుకుపోతుందని తెలియదా?
4. మొత్తం 24 పంపులకు కేవలం ఒక పంపు ఏర్పాటుచేయటంలో ఆంతర్యం ఏమిటి?
5. ఏర్పాటుచేసిన ఒక్కపంపుకూడా హంద్రి-నీవా ప్రాజెక్టునుండి ఎన్దుకు తేవలసి వచ్చింది?
ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు... జవాబులే లేవు.

Friday 18 September 2015

400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి

400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి

Updated : 7/17/2015 3:06:55 AM
Views : 3833

kcr-traget


- ప్రాజెక్టులన్నీ రీడిజైన్
- బాధ్యతలు వ్యాప్కోస్ సంస్థకు అప్పగింత
- ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు
- రెండు భాగాలుగా ప్రాణహిత ప్రాజెక్టు
- తుమ్మిడిహట్టి, కాళేశ్వరంలో వేర్వేరు ప్రాజెక్టులు
- కంతనపల్లి ప్రాజెక్టు స్థలం మార్పు
- గోదావరిలో తెలంగాణకు 953 టీఎంసీల హక్కు
- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి
- గోదావరి నది ప్రాజెక్టులపై ఆరు గంటలు సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి నదీజలాల మీద ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు తోడు అదనంగా 400 టీఎంసీల జలాలు వినియోగించుకుని రాష్ట్రంలో మరో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తుమ్మిడిహట్టినుంచి ప్రారంభించి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెందాకా ప్రతి ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు. ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలు చేసిన తుమ్మిడిహట్టి వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద మరో ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్‌తోపాటు నల్లగొండ కరువుప్రాంతాలకు కూడా నీరందించాలని నిర్దేశించారు.

kcr-traget2

గోదావరి నదీ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ రీ డిజైన్ చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)ను సీఎం కోరారు. గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ గురువారం ఆరు గంటలకుపైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గూగుల్ ఎర్త్ ఫొటోలు, వివిధ ప్రాజెక్టుల మ్యాపులు ముందు పెట్టుకుని ఆయా ప్రాజెక్టులపై వివరంగా చర్చించారు. నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, ఈఎన్‌సీ విజయప్రకాశ్, నీటిపారుదల శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వ్యాప్కోస్ జీఎం శంభు ఆజాద్, ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నియోజకవర్గానికి లక్ష ఎకరాలు: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గోదావరి బేసిన్‌లోని 54 నియోజకవర్గాల్లో నాలుగు అర్బన్ నియోజకవర్గాలు పోగా మిగిలిన 50 నియోజకవర్గాలకు సగటున లక్ష చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెంలాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పడు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మిగిలిన 40 లక్షల ఎకరాలకు 400 టీఎంసీల నీటిని అందించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. లక్ష్య సాధనకు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి విస్తరించాలి అని అధికారులకు సూచించారు.

వ్యాప్కోస్‌కు బాధ్యతలు: గోదావరి జలాలలో రాష్ర్టానికున్న వాటా నీటిని సంపూర్ణంగా, సమర్థంగా వాడుకునేలా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని సీఎం కోరారు. సమైక్య రాష్ట్రంలో గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, వాటి డిజైన్లు కూడా సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహట్టి నుంచి మొదలుకుని ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం వరకు ప్రతీ ప్రాజెక్టునూ రీ డిజైన్ చేయాలని ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల కోసం 400 టీఎంసీల నీరు ఇప్పటికే కేటాయింపులున్నాయని, ఈ కేటాయింపులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రస్తుతమున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు అనుగుణంగా డిజైన్లు రూపొందించాలని, వీలైనంత తర్వగా డిజైన్లు ఇవ్వాలని వ్యాప్కోస్‌ను సీఎం కోరారు.

తెలంగాణకు 953 టీఎంసీల హక్కు ఉంది...


రాష్ట్రంలో ప్రవహించే గోదావరి జలాల్లో మనకు 953 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది.. అయితే 433 టీఎంసీల కోసమే ప్రాజెక్టులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఇంకా 521 టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టీఎంసీలు వాడుకునే హక్కు, అనుమతులు వచ్చాయి.

వీటికి అనుగుణంగా ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవు. అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు తదితర అడ్డంకులు ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందించారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావద్దనే దురుద్దేశమే పాలకులకు ఉండేది. అందుకే తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులకు అతీగతీ లేకుండాపోయింది. ఇప్పుడు మనం వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సమర్థంగా నీటిని వినియోగించే విధంగా డిజైన్లు తయారు చేయాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న వ్యాప్కోస్‌కే ఆ బాధ్యత అప్పగిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రాణహిత డిజైన్ పనికొచ్చేది కాదు..


ప్రాణహిత-చేవెళ్ల పేరు మీద కాలయాపన చేశారని, అసలు ఇప్పుడున్న డిజైన్ పనికొచ్చేది కాదని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దానిని రెండు భాగాలు చేయాలి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వాలి. అలాగే కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరివ్వాలి. అదే ప్రాజెక్టును నిజాంసాగర్‌కు, ఎస్సారెస్పీకి అనుసంధానం చేయాలి అని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు కూడా నీరు అందించలేకపోతున్నది. 170 రోజులు లిఫ్టు చేయాల్సి ఉన్నా, 90 రోజులు కూడా నీటిని లిఫ్టు చేయలేకపోతున్నారు. దేవాదుల వద్ద నీటి నిల్వ ఉండడం లేదు. అందుకే కంతనపల్లి ప్రాజెక్టును దేవాదులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలి.

ఇప్పుడు కంతనపల్లి కోసం ప్రతిపాదించిన స్థలం వద్ద కాకుండా కొంచెం ముందుకు ప్రాజెక్టు కడితే, దేవాదులకు ఉపయోగం. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే క్రమంలో దారి మధ్యలో ఎక్కువ రిజర్వాయర్లు ఉండాలి. గ్రావిటీ కమ్ లిఫ్టు పద్ధతిలో నీటి పారకం ఉండాలి. అవసరమైన చోట ఎస్సారెస్పీ క్యారీయింగ్ సామర్థ్యం పెంచాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలి అని సీఎం అధికారులకు సవివరంగా దిశానిర్దేశం చేశారు. మన ప్రాధాన్యాలతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

గూగుల్ మ్యాప్ సహాయంతో చర్చ..


గోదావరిపై ఎక్కడెక్కడ లిఫ్టులు పెట్టాలి? ఎక్కడ ఎన్ని టీఎంసీలు వాడాలి? ఎక్కడ ఎంత నీటి ప్రవాహ ఉధృతి ఉంటుంది? ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీరు తీసుకోవాలి? ఇప్పటికే తవ్విన కాల్వలు, తీసిన సొరంగాలు, వేసిన పైపులైన్లను ఎలా ఉపయోగించాలి? ఎక్కడ నుంచి ఎక్కడి వరకు లిఫ్టు ద్వారా అందించాలి? ఎక్కడ గ్రావిటీ ద్వారా ఇవ్వాలి? ఎక్కడ కాల్వలు తవ్వాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడ కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యం ఎంత పెంచాలి? తదితర అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదికల ఆధారంతో సీఎం అధికారులతో విస్తృతంగా చర్చించారు.

గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు

నివారం, ఏప్రిల్ 25, 2015 

గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు... -ఇక ఎక్కడి నీళ్లు అక్కడే వాడకం -వీలున్నచోటల్లా జల విద్యుదుత్పత్తి -రాష్ర్టానికి ఉపయోగకరంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ -సీమాంధ్ర అన్యాయానికి తెలంగాణ పరిష్కారం -మన నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు -ప్రాజెక్టుగా కాళేశ్వరం-పాములపర్తి -సాహసోపేత నిర్ణయాలతో కేసీఆర్ సర్కార్ప్రాజెక్టులు మొదలుపెట్టాలి.. తమవారైన కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొమ్ము చేసుకోవాలి.. కానీ ప్రాజెక్టు పూర్తికాకూడదు.. నీరు పారకూడదు! అదీ సిద్ధాంతం!! తెలంగాణ దాటేలోపు గోదావరికి అడ్డంకులు ఉండకూడదు! అదీ లోగుట్టు! అత్యంత భారీ.. అత్యంత క్లిష్టమైన.. అత్యంత అసాధ్యమైన ప్రాజెక్టుగా తయారైన ప్రాణహిత-చేవెళ్ల మొదలు.. ఏ చిన్నాచితక ప్రాజెక్టు చూసినా నాటి సమైక్య పాలకుల కుట్రలన్నింటికీ ఈ రెండు అంశాలే మెట్లు! ఎప్పుడో పూర్తయిపోయినా.. ఇంకా దిగువ ప్రాంతాలకు కనీస స్థాయిలో నీళ్లందించలేకపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టే సాక్ష్యం! ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి! గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! దశాబ్దాలుగా అనుభవించిన ఈ నీటి గోసను తీర్చేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంతం పట్టింది! ఇక గోదావరి నీళ్లు ఎక్కడికక్కడే వినియోగమయ్యేలా సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్నది! గోదావరి, దాని ఉపనదుల పొడవునా.. వీలున్నచోట ప్రాజెక్టులు.. కాదంటే బరాజ్‌లు! వాటినుంచి సమీప గ్రామాలు.. పట్టణాలకు, అక్కడి పొలాలకు అవసరమైన తాగు.. సాగునీరు! పనిలోపనిగా అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి! ఇప్పటికే మన హక్కుగా మిగిలి ఉన్న 487 టీఎంసీల నీటి వినియోగంతోపాటు.. వరద జలాల్లో 500 టీఎంసీల నుంచి వెయ్యి టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం! ఈ సత్సంకల్పం పూర్తయితే.. ఇంక బంగారు తెలంగాణ నిర్మాణానికి అడ్డెవ్వరు?  నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:గోదావరిలో నీళ్లున్నా ఇంతకాలం తెలంగాణ నెత్తిపై శని ఉంది. సమైక్య ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టలేదు. చేపట్టినా వివాదాలలో ఇరికించేందుకు ప్రయత్నించాయి. వివాదాలు లేకపోతే సృష్టించాయి. ప్రాజెక్టులు మొదలు పెట్టాలి కానీ పూర్తి కావద్దు. కాలువలు తవ్వాలి కానీ నీళ్లు పారొద్దు. సమైక్య ప్రభుత్వాల కుట్రలను గుర్తుపట్టిన తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులను పునఃసమీక్షిస్తున్నది. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సృష్టించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంతంగా పనిచేస్తున్నారు. గోదావరి నదిపై వీలైనన్ని బరాజ్‌లు నిర్మించి నీటిని లిఫ్టు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టే విషయమూ పరిశీలిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించేవాళ్లు, తొర్రలు వెతికేవాళ్లు కొందరున్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ఎత్తేస్తున్నారని ఒకరు, ఆదిలాబాద్‌కు అన్యాయం చేస్తున్నారని మరొకరు, కంతానపల్లి ఎలా కడతారని ఇంకొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉన్నవీలేనివీ పోగేసి ఆంధ్రా మీడియాలో కుప్పపోస్తున్నారు.  ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలవల్ల ఏదో భారం పెరగబోతున్నదని, ప్రాజెక్టులు ఆచరణ సాధ్యం కావని, ఇంకా ఏవేవో ప్రచారాలు ప్రారంభించారు. ఆంధ్రా మీడియాకు, నాయకత్వానికి కావలసింది తెలంగాణ ప్రాజెక్టులు ముందుపడొద్దు. వాళ్లు తెలంగాణ వారినే కొందరిని కవచంగా పెట్టుకుని ప్రచార యుద్ధాలు సాగిస్తున్నారు. మీరు పాత ఆలోచనలు వదిలేయండి. ఇప్పుడు మనం స్వరాష్ట్రంలో ఉన్నాం. కొత్తగా ఆలోచించండి. స్వేచ్ఛగా ఆలోచించండి. మన ప్రాంతానికి మనం ఎక్కువగా ఏం చేయగలమో పరిశీలించండి. ఎవరో ఏదో అంటారని మరచిపోండి. ప్రజలకు నీళ్లిస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారు అని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజినీర్లతో పదేపదే చెప్తున్నారు. ఇటువంటి ఆలోచనలనుంచి పుట్టిందే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సమీక్ష కూడా అందులో భాగమే. దానికంటే మంచి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు అధ్యయనం బాధ్యత అప్పగించింది. ప్రాణహిత-చేవెళ్లపై మహారాష్ట్ర ఆందోళన ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడినుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లినుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించాలన్నది ప్రస్తుత ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల మొత్తం 6140 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అంచనా. అందులో 5247 ఎకరాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు చేసిన ఫడ్నవీస్ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తమ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలో ముంపు తగ్గే అవకాశాన్ని పరిశీలించాని విజ్ఞప్తి చేస్తూ స్వయంగా ఓ వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేసినట్లు నీటిపారుదలవర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ముంపు తగ్గించగలిగితే 160 టీఎంసీలే కాదు, అంతకన్నా ఎక్కువ వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఫడ్నవీస్ అన్నట్లు తెలిసింది. ప్రాణహిత బ్యారేజీవద్ద నుంచి 90 రోజుల పాటు నీటిని మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మేడిగడ్డ వద్ద ప్రతిపాదిస్తున్న బ్యారేజీ నుంచి ఆరు మాసాల పాటు నీటిని మళ్లించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ఏడు జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు కనుక, ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఏది ఏమైనా వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేసే ప్రాజెక్టు కాదు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో చాలా సమస్యలున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంకోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు. పూర్తికాకుండా ఉండడంకోసం రూపొందించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు. 28 ప్యాకేజీలు, 206 కిలోమీటర్ల టన్నెళ్లు, 849 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 22 లిఫ్టులు, 3466 మెగావాట్ల విద్యుత్ అవసరం, 1757 మీటర్ల ఎత్తిపోత.. ఎప్పటికి పూర్తి కావాలి? చేవెళ్లకు ఎప్పుడు నీరందించాలి? చేవెళ్లకు సూటిగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాలనుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని ప్రాణహితనుంచి నీటిని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించడమే పెద్ద కుట్ర. కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాజేసే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నడిపించిన కుతంత్రం. శ్రీశైలంను కబ్జా చేయడంకోసమే ఆయన పోలవరంను హడావిడిగా మొదలుపెట్టారు. కృష్ణా నదిని రాయలసీమకు మళ్లించడం కోసమే ఆయన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును ప్రారంభించారు. చివరి భూములకు నీళ్లివ్వలేని ఎస్సారెస్పీ విచిత్రం ఏమంటే శ్రీరాంసాగర్ నుంచి కరీంనగర్ జిల్లాలోనే చివరి భూములకు నీళ్లు రావడం ఆగిపోయింది. వరంగల్ జిల్లాకు ఎప్పుడో ఒకసారి కాకతీయకాలువ నీళ్లు వస్తాయి. ఎండాకాలమయితే మంచినీటికోసంకూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. వరంగల్ జిల్లా నిండా కాలువలైతే తవ్విపెట్టారు. ఒకటికాదు రెండు కాదు. శ్రీరాంసాగర్ రెండో దశ. రెండు పాయలుగా చీలి ఒకటి సూర్యాపేట సమీపంలోని మోతెదాకా వెళుతుంది. మరో కాలువ మహబూబాబాద్‌దాకా వెళుతుంది. మరోవైపునుంచి వరద కాలువకూడా చేర్యాల ప్రాంతంలో ప్రవేశించి దేవరుప్పలదాకా వచ్చింది. ఇంకోవైపు దేవాదులకోసం వేసిన పైపులైన్లు. కాలువల మీద కాలువలు. కాలువలమీద పైపులైన్లు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ప్లాను లేదు. రైతులకు నీళ్లు మాత్రం రావడం లేదు. కాలువలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలుస్తున్నాయి. గోదావరి నీటిని ఇక్కడెక్కడా ఇద్దామని ఆలోచన చేయని రాజశేఖర్‌రెడ్డి ప్రాణహితకు ఎందుకు వెళ్లాడో ఎవరికీ ఎందుకు అర్థం కావడం లేదు? పోనీ అదయినా సక్కగా చేశారా? తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి పోయకుండానే అక్కడి నుంచి చేవెళ్లదాకా కాలువల తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేశారు. తుమ్మిడిహట్టి బరాజ్‌పై మహారాష్ట్రతో అవగాహనకు రాకుండానే దిగువన వందల కోట్లు ఖర్చుచేశారు. మొబిలైజేషను అడ్వాన్సులు ఇచ్చేశారు. ఒక వరుసక్రమం, ప్రాధాన్యతాక్రమం ఏదీ లేదు. ఏరోజుకు నీళ్లివ్వాలన్న కాల నిర్ణయ ప్రణాళిక లేదు. గోదావరి నీటితో నిమిత్తం లేకుండా 16.4 లక్షల ఎకరాలను సాగులోకి తేగలమని అప్పటి ప్రభుత్వం నమ్మబలికింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2,46,704 ఎకరాలను సాగులోకి తేనున్నట్టు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. మనవాళ్లు కూడా చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. వాళ్లకు కావలసింది గోదావరిపై మరో ప్రాజెక్టు ఏదీ లేకుండా చూడడమేనని లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వ్యాప్కోస్ నివేదిక చేసే సూచనల ప్రకారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తే ప్రాజెక్టు కాళేశ్వరానికి దిగువకు మారుతుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టివద్ద చిన్న ఆనకట్ట నిర్మించి పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో ముందు నిర్ణయించిన ప్రకారం 56,200 ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. తుమ్మిడిహట్టి వద్ద నదిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. ఇప్పటివరకు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి లోపు 900 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు, కొంత టన్నెల్ తవ్వారు. ఇంకా రూ.4500 కోట్ల విలువచేసే పనులు పెండింగులో ఉన్నాయి. ఆ నిధులను కొత్త ప్రాజెక్టుకు మళ్లించవచ్చు. ముంపు వివాదానికి తావివ్వని రీతిలో ఆనకట్టను నిర్మించి, నీటిని మళ్లించి, ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా పైన పేర్కొన్న ఆయకట్టుకు నీరందించాలి. ఆనకట్ట నిర్మాణానికి, ఈ ఆయకట్టును సాగులోకి తీసుకురావడానికి 300 నుంచి 400 ఖర్చవుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. అలాగే చేవెళ్లనుకూడా ప్రాణహిత ప్రాజెక్టునుంచి విడదీయాలి. చేవెళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుద్వారా నీరివ్వడం సులువు. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. చేవెళ్ల కృష్ణా పరివాహక ప్రాంతం కూడా అని రిటైర్డు చీఫ్ ఇంజినీరు ఒకరు చెప్పారు. అంటే ప్రాణహిత, చేవెళ్ల రెండు కూడా ఈ ప్రాజెక్టునుంచి డీలింక్ అయ్యే అవకాశాలున్నాయి అని ఆయన చెప్పారు. ఈ మార్పులు జరిగితే కాళేశ్వరం-పాములపర్తి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబోతున్నదా లేక మరో రూపం తీసుకుంటుందా అన్నది వ్యాప్కోస్ నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన పనులు కూడా వరదల కాలంలో ఉపయోగపడతాయి. మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా ఉపయోగపడే మిడ్‌మానేరుకు కాళేశ్వరంతోపాటు ఎల్లంపల్లి కూడా అదనపు ఫీడరుగా పనిచేస్తుంది. మిడ్‌మానేరు నుంచి పాములపర్తి దాకా ప్రాజెక్టు రూపు రేఖల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు. కాళేశ్వరం ఎందుకు? తుమ్మిడిహట్టి వద్ద లభించే ప్రాణహిత నీరే వందకిలోమీటర్లు దిగువన కాళేశ్వరం వద్ద కూడా లభిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులనుంచి వచ్చే అనేక వాగులు తుమ్మిడిహట్టికి దిగువనే ప్రాణహితలో కలుస్తాయి. పెద్దవాగు, రాళ్లవాగుదాకా అరడజనుకు పైగా ఆదిలాబాద్ వాగులు అటు ప్రాణహిత ఒడిని, ఇటు గోదావరి ఒడిని చేరతాయి. కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువ. కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద నది సన్నగా మారుతుంది. అక్కడినుంచి కాళేశ్వరందాకా నది వెడల్పుగా ఉంటుంది. అక్కడ నదీగర్భంలోనే వీలైనంత ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. ముంపు వివాదానికి ఎక్కువగా ఆస్కారం ఉండదని వారంటున్నారు. అక్కడ ఒక్క చోట లిఫ్టు చేసి టన్నెల్ ద్వారా కరీంనగర్ పట్టణానికి ఎగువన వరద కాలువదాకా తీసుకువస్తే అక్కడ మరో లిఫ్టుద్వారా వరద కాలువలోకి నీటిని మళ్లించవచ్చునని వారు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. రెండే లిఫ్టులతో మిడ్ మానేరు దాకా నీరు తేవచ్చునని ఇంజినీర్లు ప్రాథమిక అంచనాలు వేశారు. నీటిలభ్యత, ఫీజిబులిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. నీటి విలువ గోదావరిలో ఇప్పటివరకు మనం ఉపయోగించుకోగా ఇంకా మనకు హక్కుగా మిగిలి ఉన్న నికరజలాలు 487 టీఎంసీలు. గోదావరిలో వరద జలాలపై కూడా రాష్ర్టానికి పూర్తి హక్కులున్నాయి. ఇప్పుడు సీడబ్ల్యుసీ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ప్రాతిపదికన ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న నీరు గత యాభైయ్యేళ్ల సగటు 1781 టీఎంసీలు. సముద్రంలో కలిసిన జలాలు గత పదిహేనేళ్ల సగటు 2783 టీఎంసీలు. వరద జలాలు ప్రతిఏటా సుమారు మరో 500 నుంచి 1000 టీఎంసీలు ఉపయోగించుకునే హక్కు, అవకాశం మనకు ఉంది. -ఒక శతకోటి ఘనపుటడుగుల (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్-టీఎంసీ) నీరు అంటే 2.80 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు. -2831.6 కోట్ల లీటర్ల నీరు. -22,956.84 ఎకరాల్లో ఒక అడుగు మందం నిలుకోగలిగిన నీరు. -6000 ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి పండించవచ్చు. -రూ.25కోట్లనుంచి రూ.30కోట్ల విలువచేసే 2,40,000 బస్తాల ధాన్యం పండించవచ్చు. -10,000 ఎకరాల్లో ఆరుతడి పంటలు పండించవచ్చు. -15,000-20,000 ఎకరాల్లో బిందుసేద్యం చేయవచ్చు. -56,63,200 వాటర్ ట్యాంకర్లు (5000 లీటర్లవి) నింపవచ్చు. వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించడంతోపాటు దుమ్ముగూడెందాకా వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రయత్నం చేయాలని ఇంజినీర్లు సూచించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత పన్నెండు కిలోమీటర్లు దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కంతానపల్లి, దుమ్ముగూడెంలలో బరాజ్‌లు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో నీరందండం లేదని, అవసరమైతే ఇక్కడ కూడా ఒక చిన్న బరాజ్‌ను నిర్మించడం కానీ కంతానపల్లి ఎత్తుపెంచి నిర్మించడం కానీ వాంఛనీయమని వారు సూచిస్తున్నారు. జలవిద్యుత్ తుమ్మిడిహట్టినుంచి కాళేశ్వరం వచ్చేసరికి ప్రాణహిత సుమారు 80 మీటర్లు దిగువకు ప్రవహిస్తుంది. ఇంద్రావతి 70 మీటర్లు దిగువకు ఉధృతితో ప్రవహించి ప్రతాపగిరి వద్ద గోదావరిలో కలుస్తుంది. తుమ్మిడిహట్టినుంచి దుమ్ముగూడెందాకా పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. వెయ్యి టీఎంసీల నీటినుంచి సుమారు 50వేల మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది అని విద్యుత్ నిపుణుడు వెంకట్ గాంధీ చెబుతున్నారు. ఇంద్రావతి చాలా వేగంగా ప్రవహించేనది. ప్రాణహిత కూడా ఉధృతి ఎక్కువే. కాళేశ్వరం నుంచి దుమ్ముగూడెం వరకు నదీ ప్రవాహం మంద్రంగా ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో కలసి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. రామగుండంనుంచి భద్రాచలందాకా మంచి జలమార్గాన్ని కూడా నిర్మించవచ్చు అని ఆయన సూచించారు. (నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) జై తెలంగాణ!   జై జై తెలంగాణ! Copy the BEST Traders and Make Money (One Click) : http://ow.ly/KNICZ Copy the BEST Traders and Make Money (One Click) : http://ow.ly/KNICZ

Copy the BEST Traders and Make Money (One Click) : http://ow.ly/KNICZ

గోదావరిపై కొత్త ప్రాజెక్టులు

గోదావరిపై కొత్త ప్రాజెక్టులు

Posted On 63 days 15 hours 3 mins ago
గోదావరిపై కొత్త ప్రాజెక్టులు
- పూర్తి హక్కు మేరకు వినయోగం
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో
               గోదావరి నది పై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి ప్రాజెక్టులపై గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 953 టీఎంసీలు. మనకు ఈ స్థాయిలో జలాలు వాడుకునే హక్కు ఉన్నా.. 433 టీఎంసీలు మాత్రమే వాడుకునే ప్రాజెక్టులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా 521 టీఎంసీలు వాడుకునేందుగా వీలుగా గోదావరిపై ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. వీటిలో ఇప్పటికే 400 టీఎంసీలు వాడుకునేందుకు మనకు అనుమతులు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. '' అని అన్నారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో గోదావరి జలాల వినియోగంతో పాటు వివిధ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా అప్పటి పాలకులు నిర్ణయాలు తీసుకున్నారని దీని వల్ల ఏళ్ల తరబడి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరాష్ట్ర వివాదాలు, భూ సేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు రూపొందించి, అరకొరగా నిధులు విడుదల చేయడం వల్ల నష్టం జరిగిందని, ప్రాజెక్టుల నుంచి నీరు అందలేదని తెలిపారు. గోదావరి బేసిన్‌ లో తెలంగాణలో 50 నియోజకవర్గాలున్నాయని ఈ నియోజక వర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు ప్రస్తుతమున్న ప్రాజెక్టులకనుగుణంగా డిజైన్లు రూపొందించాలని ప్రముఖ కన్సల్టెన్సీ వ్యాప్కోస్‌ను ముఖ్యమంత్రి కోరారు.

వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు సాగునీరు అందించేందకు

రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు - సీఎం చంద్రబాబు 
Updated :18-09-2015 12:12:40
 విజయవాడ, సెప్టెంబరు 18 : రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. బోగస్‌ కార్డు ఏరివేశామన్నారు. ఎక్కడా కూడా విద్యుత్‌ కోతలు విధించడానికి వీల్లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు  సాగునీరు అందించేందకు విధానం రూపొందిస్తామన్నారు. నదుల అనుసంధానం చేసిన రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. గ్రామాలకు నీళ్లు ఎలా వెళ్లాలనేది కలెక్టర్లు చూడాలని కోరారు. కలెక్టరు అని బ్రిటీషు వాళ్లు పెట్టిన పేరును మార్చాలని, దీనిపై దేశంలో చర్చ జరగాలన్నారు. 15,500 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందని దీనిపై అధికారులు దృష్టి సారించి వనరులను పెంచుకోవాలని సీఎం
ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో నిధులను సక్రమంగా వినియోగించుకునేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.

Wednesday 16 September 2015

పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలేమిటి?:బోర్డు

పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలేమిటి?:బోర్డు
Updated :04-09-2015 02:06:09
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ పథకంపై తెలంగాణ ఫిర్యాదుకు ఏపీ ఇరిగేషన్‌ వర్గాలు ఇచ్చిన సమాధానాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషికి గోదావరి బోర్డు పంపింది. దీనిపై అభ్యంతరాలను చెప్పాలని కోరింది. పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. అది కొత్త ప్రాజెక్టేనని, నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గోదావరి అపెక్స్‌ బోర్డు అనుమతి తీసుకోలేదని ఫిర్యాదు చేసింది. దానిని గోదావరి బోర్డు ఏపీ ఇరిగేషన్‌శాఖకు పంపి సమాధానాన్ని కోరింది. పట్టిసీమ పోలవరంలో భాగమేనని, పోలవరం పూర్తికాగానే పట్టిసీమను రద్దు చేస్తామని ఏపీ ఇరిగేషన్‌వర్గాలు సమాధానమిచ్చాయి.

పట్టిసీమపై తెలంగాణ పట్టు

పట్టిసీమపై తెలంగాణ పట్టు

పట్టిసీమను అడ్డుకోండి గోదావరి బోర్డుకు టీ సర్కారు ఫిర్యాదు

పట్టిసీమను అడ్డుకోండి
గోదావరి బోర్డుకు టీ సర్కారు ఫిర్యాదు

Updated :09-07-2015 02:44:45
హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలవరించాలని గోదావరి నది నిర్వహణ బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. ‘పోలవరం దిగువ భాగంలో కుడి ప్రధాన కాలువ నుంచి 80 టీఎంసీల వరద నీటిని కృష్ణా నదికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను ఈపీసీ విధానంలో ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 84(3)(2)ను, సెక్షన్‌ 85(డీ) పేరా 7ను ఉల్లంఘించడమే. ప్రాజెక్టు చేపట్టేముందు గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కూడా ఉల్లంఘించింది. ఏపీ సర్కారు నిర్ణయం చట్టవిరుద్ధం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున గోదావరి మిగులు జలాల వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సి ఉంది. వీటి విషయంలో ఎలాంటి పంపకాలు జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు లేదు’ అని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

అబద్ధాల పట్టిసీమ !

అబద్ధాల పట్టిసీమ !

Updated : 9/2/2015 2:00:52 AM
Views : 699
-నికర జలాల పోలవరంలో అంతర్భాగమని కేంద్రానికి వివరణ
-మిగులు జలాలంటున్న జనవరి నాటి పట్టిసీమ జీవో
-ఏపీ వివరణను తెలంగాణకు పంపిన కేంద్రం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టిసీమపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని వాదించిన చంద్రబాబు, జనవరిలో విడుదల చేసిన జీవోలో దీన్ని మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నికరజలాల ఆధారంగా నిర్మిస్తున్నారు. అందులో పట్టిసీమ అంతర్భాగమే అయిన పక్షంలో అదీ నికర జలాలతో నిర్మించాలి. కానీ జనవరినాటి ఏపీ ప్రభుత్వ జీవోలో అది కాస్త మిగులు జలాల ప్రాజెక్టుగా బయటపడింది. దీన్నిబట్టి పట్టిసీమకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధం లేదని అర్థమవుతుంది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను అక్రమ ప్రాజెక్టులంటూ గతంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

దీనిపై కేంద్రం వివరణ కోరగా వివిధ అంశాలను పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం వివరణ పంపించింది. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం 12 లేఖలు రాసిన దరిమిలా తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరి, బదులు తెప్పించుకుంది. ఏపీ సర్కారు పంపిన వివరణ లేఖను ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. అందులో పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని, ముఖ్యంగా నదుల అనుసంధానంలో భాగంగా తమ సొంత ఖర్చుతో దీనిని చేపడుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం బుకాయించింది. అయితే పోలవరం ప్రాజెక్టు నికరజలాలపై ప్రతిపాదించిన ప్రాజెక్టు కాగా... పట్టిసీమ మిగులు జలాలపై చేపడుతున్నది. పట్టిసీమకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటిన జారీ చేసిన జీవోలోనే ఈ విషయం స్పష్టంగా పేర్కొంది.

పార్లమెంటులో ప్రకటించినా పట్టదు...


మరోవైపు పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని కేంద్రమంత్రి పార్లమెంటులోనే ప్రకటించారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, కంబంపాటి హరిబాబు పోలవరంపై అడిగిన ప్రశ్నకు జులై 23న కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు... ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అందలేదు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సమాధానం వచ్చిన పదిహేను రోజులకే (05.08.2015) ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి పంపిన లేఖలో పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమంటూ బుకాయించడం విచిత్రం.

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే
తెలంగాణ అభ్యంతరం సరికాదు
గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ సమాధానం

Updated :05-08-2015 01:38:30
  • ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టూ కాదు.. కొత్తదీ కాదు
  • తెలంగాణ అభ్యంతరాల్లో అర్థం లేదు
హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్‌ రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని.. ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవ డం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్ర భుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను ఏపీ ప్ర భుత్వానికి బోర్డు పంపింది. ఈ సమయంలో తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలతో కూడిన లేఖ ప్రతిని జత చే సింది. ఈ లేఖపై ఏపీ సర్కార్‌ చాలా ఘాటుగా.. తార్కికంగా సమాధానం ఇచ్చింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందో గ్రహించాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ భూభాగమే ఉందని.. మరో 30 కిలోమీటర్లలో ఈ నీరంతా సముద్రంలో కలుస్తుందని గుర్తెరగాలని పేర్కొంది. పొరుగున ఉన్న ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాలతో పట్టిసీమ ప్రాజెక్టుపై వివాదం లేదని స్పష్టం చేసింది. పట్టిసీమ వద్ద నుంచి నీరు ఎగువ రాష్ట్రాలకు వెళ్లదని కూడా గ్రహించాలని సూచించింది. సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగానే నిర్మిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పేచీ ఉందని.. పట్టిసీమ విషయంలో ఎలాంటి పేచీలూ లేవని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందిస్తున్నామని వివరించారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు కొంతమేర ‘గ్రావిటీ’తోనూ.. మరికొంత మేర ‘పంపింగ్‌’ ద్వారా నీటిని పంపుతున్నారని.. ఇలా రెండు విధాలుగా పంపుతున్నంత మాత్రాన.. రెండు ప్రాజెక్టులు అవుతుందా అని ప్రశ్నించారు. పోలవరం కింది భాగాన పట్టిసీమను తాత్కాలికంగా నిర్మిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే దీనిని తొలగిస్తామని కూడా వివరించారు. నీరు పల్లమెరుగు అనే సామెతను గుర్తు చేసుకోవాలని.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద నుంచి నీరు ఎగువ రాష్ట్రానికి వెళ్లదని.. కిందనున్న సముద్రంలో కలుస్తుందని తెలిపారు. అందువల్ల ఈ ప్రాజెక్టుపై వెలిబుచ్చే అభ్యంతరాలకు అర్థమే లేదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఏపీ స్పష్టం చేసింది.

నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం వితండవాదం

    హైదరాబాద్:కృష్ణా జలాలు, నాగార్జునసాగర్ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల రంగం) ఆర్ విద్యాసాగర్‌రావు విమర్శించారు. నీటి వాటాల జోలికివెళ్లకుండా అవసరాల ప్రకారం నీటి పంపకం జరగాలని వింత వాదన చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. నీటి వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనలను లెక్కలతో సహా తిప్పికొట్టారు. ట్రిబ్యునల్, కోర్టు తీర్పులను పట్టించుకోవడంలేదని, ఇప్పటికే ఏపీ తనకు కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటినే వినియోగించుకుందని స్పష్టం చేశారు. R-Vidyasagarrao బచావత్ ట్రిబ్యునల్ గత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలని ఆయన చెప్పారు. ట్రిబ్యునల్ అనుమతించిన ఆయా ప్రాజెక్టుల నీటి అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అనుమతించిన పరిమాణాలను కలిపి గుండుగుత్తగా రాష్ర్టానికి ఈ మొత్తం కేటాయింపు జరిగిందని తెలిపారు. అయితే 811 టీఎంసీలు మించకుండా ఆయా ప్రాజెక్టులకు అనుమతించిన పరిమాణాలలో మార్చుకునే వెసులుబాటును ట్రిబ్యునల్ తుది తీర్పులోని క్లాజ్ 15లో కల్పించారని చెప్పారు. ఆ వెసులుబాటు పుణ్యమా అని గత ప్రభుత్వాలు కేసీ కాలువకు అనుమతించిన పరిమాణంలో 8 టీఎంసీలు కుదించి, రీజనరేషన్ తాలూకు 11 టీఎంసీలను జోడించి, వెరసి 19 టీఎంసీల వినియోగంతో శ్రీశైలం కుడి కాలువకు నికర జలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టా ఆధునీకరణ మూలంగా 29 టీఎంసీలు మిగులుతాయని లెక్కలుకట్టి అందులో 20 టీఎంసీలను భీమాకు, మరో 9 టీఎంసీలను పులిచింతలకు కేటాయించడం జరిగిందని విద్యాసాగర్‌రావు చెప్పారు. దీన్నిబట్టి స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. గత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు.. అంటే 811 టీఎంసీల పరిమాణం మాత్రమే నిలకడగా, నిశ్చలంగా ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు కూడా తన తుది తీర్పులో కచ్చితంగా ఇంత నీరు అని కేటాయింపు (స్పెసిఫిక్ ఎలకేషన్) జరపలేదు. బచావత్ ట్రిబ్యునల్ గత ఉమ్మడి రాష్ర్టానికి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణ ప్రాజెక్టులకు సంక్రమించే హక్కు 299 టీఎంసీలు. మిగిలిన 512 టీఎంసీలు ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుంది. ఈ విషయం అనేక జీవోలలో, పుస్తకాల్లో పొందుపరిచి ఉన్నది అని ఆయన వివరించారు. 230 టీఎంసీలు తెలంగాణకు.. 322.80 టీఎంసీలు ఆంధ్రాకు.. గత ఏడాది జూన్ ఒకటినుంచి ఇప్పటివరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి ప్రధాన కృష్ణానది, దాని ఉప నదుల నుంచి నికరంగా చేరిన మొత్తం నీరు (ప్రాజెక్టులు వినియోగించుకున్న నీరు, ఆవిరి, ఇతర నష్టాలు మినహాయించి) 552.8 టీఎంసీలు. ఇందులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ అనుమతించిన ప్రాజెక్టుల వినియోగం ప్రకారం 41.61 శాతం తెలంగాణకు, 58.39 శాతం ఆంధ్రాకు లభ్యమవుతుంది. అంటే 230 టీఎంసీలు తెలంగాణకు, 322.80 టీఎంసీలు ఆంధ్రాకు చెందుతాయి. వాస్తవాలు ఇలా ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో లభ్యమయ్యే నీటిలో సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టు అవసరాలనుబట్టే నీటి పంపకం జరపాలని, సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టుల వినియోగ ప్రసక్తి లేవనెత్తవద్దని ఆంధ్రా వాదిస్తున్నది. ఈ వాదన ఎంత వరకు సహేతుకమైందో విజ్ఞులే నిర్ణయించాలి అని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు అనుమతించిన నీటిని, ఆయా ప్రాజెక్టులలో వినియోగించుకోకుంటే, ఆ నీటిని వేరే ప్రాజెక్టుల్లో ఉపయోగించుకోకూడదా? అని విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుకు నిర్ణయించిన నీటిని అక్కడ వాడుకోకపోతే వేరే వాడుకోవడానికి వీల్లేదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. తెలంగాణకు చెందిన జూరాల, భీమా, కోటిపల్లివాగు, ఊకచెట్టువాగు, డిండి, కోయల్‌సాగర్ ఇంకా చిన్ననీటి ప్రాజెక్టులు కలిపి 88.60 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఉంది. వివిధ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం 78 టీఎంసీల నీటిని వినియోగించుకోలేకపోయింది. అలా వినియోగించుకోలేని నీటిని నాగార్జునసాగర్‌లో పదిల పర్చుకుని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రబీకి వాడుకుంటామని తెలంగాణ చెబుతుంటే, అలా కుదరదని వాదిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం దానికి కారణాలు మాత్రం చెప్పటం లేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు సంక్రమించిన నీటి పరిమాణం మొత్తాన్ని ఎక్కడైనా, ఏ ప్రాజెక్టులోనైనా వాడుకునే హక్కును బచావత్ ట్రిబ్యూనల్ క్లాజ్ 15లో కల్పించిందని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. అనుమతించిన ప్రాజెక్టుల్లో మాత్రమే అనుమతించిన నీటినే వాడుకోవాలని వాదిస్తున్న ఆంధ్ర.. ఎలాంటి అనుమతులు లేని హంద్రీనీవా, తెలుగుగంగకు నీటిని తరలించటాన్ని ఎలా సమర్థించుకుంటుందని ఆయన నిలదీశారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తయితే తప్పా భీమాకు నీరు ఇవ్వటం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం ఏ లేఖలో.. ఏ రిపోర్టులో ఆ విషయం చెప్పిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాకు అవసరమైన 18120టీఎంసీల నీటిలో 18.90టీఎంసీలు మాత్రమే సాగర్ దిగువ నుంచి వస్తుంది కనుక మిగిలిన 162.3టీఎంసీల నీటిని సాగర్ నుంచి వదలాలని ఆంధ్రప్రదేశ్ మొండి వాదన చేస్తున్నది. నిన్నటి వరకు మీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు డెల్టా కోసం సవరించిన నీటి అనుమతి 152.20 టీఎంసీలు. ఇందులో 101.20 టీఎంసీలు సాగర్ దిగువన లభ్యమవుతాయి. ఈ లెక్కన 51 టీఎంసీలు డెల్టాకు, 9 టీఎంసీలు పులిచింతలకు.. మొత్తం 60టీఎంసీలు ఇస్తే సరిపోతుంది. అదీకాక డెల్టాకు అవసరమైన 181.2టీఎంసీల్లో 80టీఎంసీలు సాగర్‌నుంచి వదలాలని.. 101.20టీఎంసీలు దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గల పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. ఇంత చేసి.. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు అని విద్యాసాగర్‌రావు విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలాడటం తగదని ఆయన ఏపీకి హితవు పలికారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే నాగార్జునసాగర్‌లో నిల్వ చేసిన నీటిపై కృష్ణా డెల్టాకు ఎలాంటి హక్కు లేదు. ఎగువ, దిగువ నుంచి లభించే ఫ్రీ సప్లయిలను మాత్రమే వాడుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టు పేర్కొంటున్నది. కృష్ణా డెల్టాలో సాగర్ దిగువన లభించిన నీటి పరిమాణం 108టీఎంసీలు.. అంటే 101.20టీఎంసీల కంటే ఏడు టీఎంసీలు ఎక్కువ. ఈ డేటా కూడా 1972-73నుంచి 2007-08వరకు పరిగణలోకి తీసుకుంది. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు వాడిన నీరు 167టీఎంసీలు. ఇందులో సాగర్‌నుంచి 131.50టీఎంసీలు, దిగువన లభించిన నీరు 36టీసీఎంలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు 18.90టీఎంసీలు మాత్రమే వస్తాయని ఆంధ్రప్రదేశ్ వాదించి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నట్లు? నివేదికలు, రిపోర్టులు స్పష్టంగా చెబుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టుకు వెళతామని చెబుతున్నారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు అని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు.