Sunday 29 May 2016

జలవివాదం – పది ప్రశ్నలు

జలవివాదం – పది ప్రశ్నలు 

పోలవరం ప్రాజెక్టు నుండి నదుల అనుసంధానం ద్వార 80 టీయంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లోనికి మళ్ళించినపుడు, అందులో ఉమ్మడిఆంధ్రప్రదేశ్ 55 శాతం (44 టీయంసీలు), ఎగువ రాష్ట్రాలయిన మహారాష్ట్ర 27 శాతం (21.6 టీయంసీలు), కర్ణాటక 18 శాతం (14.4 టీయంసీలు) చొప్పున పంచుకోవాలని బచావత్ ట్రిబ్యూనల్ గోదావరి జలవివాదాల తీర్పులో వుంది.
అయితే ఈ పంపకాలు ఎప్పటి నుండి ఎలా అమల్లోనికి వస్తాయి అన్నది ఇప్పుడు కీలక అంశం.
1. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన రోజు నుండే ఈ పంపకాలు అమల్లోనికి వచ్చేస్తాయా?
2. పోలవరం నుండి నీళ్లను విడుదల చేసిన రోజు నుండి ఈ పంపకాలు అమల్లోనికి వస్తాయా?
3. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఎప్పుడు వచ్చింది?
4. అప్పటి నుండే ప్రతియేటా ఎగువ రాష్ట్రాలకు వాట ఇస్తున్నారా?
5. నీటి విడుదల ప్రమాణాన్నిబట్టి వాటాలు పంచుకుంటారా? లక్ష్యం మేరకు నీటి విడుదల జరక్కపోయినా ఎగువరాష్ట్రాలు ముందుగానే తమ వాటాను తీసేసుకుంటాయా?
6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాలో ఇప్పుడు తెలంగాణాకు కూడా ఉపవాటా ఇవ్వాల్సివుంటుందా?
7. తెలంగాణ వాటా ఎప్పటి నుండి అమల్లోనికి వస్తుందీ?
8. ప్రస్తుత నీటిపారుదలా సంవత్సరంలో పోలవరంలో అంతర్భాగమైన పట్టిసీమ ద్వార కృష్ణాడెల్టాకు మళ్ళించిన నీరెంత?
9. ప్రస్తుత నీటిపారుదలా సంవత్సరంలో నదుల అనుసంధానం కారణంగా తెలంగాణాతో సహా ఎగువరాష్ట్రాలకు ఇచ్చిన వాటా నీళ్ళెంత?
10. పట్టిసీమ ద్వార కృష్ణాడెల్టాకు మళ్ళించిన నీరు ఎక్కువా? మళ్ళింపు కారణంగా ఎగువరాష్ట్రాలకు ఇచ్చిన నీరు ఎక్కువా?