Friday, 11 September 2015

ఈనెల 16న పట్టిసీమ ప్రారంభోత్సవం

ఈనెల 16న పట్టిసీమ ప్రారంభోత్సవం
Updated :11-09-2015 11:34:55
విజయవాడ, సెప్టెంబర్ 11 : ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసందానానికి ప్రభుత్వం అధికారికంగా నాంది పలుకబోతోంది. ఈనెల 16న గోదావరి దగ్గర నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎత్తిపోతల పథకంలో మొదటి పంపును ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం ఒంటింగలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహింపట్నంలో గోదావరి-కృష్ణ నదుల అనుసందానాన్ని సీఎం అధికారికంగా ప్రకటించనున్నారు.
 
తాడిపూడి ఎత్తిపోతల పథకంతో పాటు వాగులు, వంకల ద్వారా పొంగివచ్చిన గోదావరి జలాలను పోలవరం రైట్ కెనాల్ ద్వారా తరలింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. నూజివీడు మండలం పల్లెర్లమూడి నుంచి ప్రస్తుతం గన్నవరంలోని పోలవరం రైట్ మెయిన్ వరకు నీరు ప్రవహిస్తున్నాయి. వీరపనేనిగూడెం, చుక్కవరం, కుందనపల్లి గ్రామాల్లోకి నీరు రావడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జలపూజ చేసి ఆ నీటిని కిందకు విడుదల చేయనున్నారు.
 
 
అక్కడి నుంచి నీరు విజయవాడ రూరల్ మండలం పుడమేరులో కలసి వీటీపీఎస్ రివర్స్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ ఎగువభాగం నుంచి కృష్ణా నదిలో కలుపనున్నారు. ఈ నెల 15 మధ్యాహ్నానికి నీరు ఇబ్రహింపట్నం చేరుకోనున్నాయి. ఈ క్రమంలో 16వ తేదీన మధ్యాహ్నం సీఎం చంద్రబాబు జలపూజ చేసి నదుల అనుసంధానాన్ని భారీ బహిరంగ సభ ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు.
 
అనంతరం సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం దంపతులు హాజరై శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం బహిరంగ సభను టీడీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

No comments:

Post a Comment