Wednesday, 16 September 2015

పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలేమిటి?:బోర్డు

పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలేమిటి?:బోర్డు
Updated :04-09-2015 02:06:09
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ పథకంపై తెలంగాణ ఫిర్యాదుకు ఏపీ ఇరిగేషన్‌ వర్గాలు ఇచ్చిన సమాధానాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషికి గోదావరి బోర్డు పంపింది. దీనిపై అభ్యంతరాలను చెప్పాలని కోరింది. పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. అది కొత్త ప్రాజెక్టేనని, నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గోదావరి అపెక్స్‌ బోర్డు అనుమతి తీసుకోలేదని ఫిర్యాదు చేసింది. దానిని గోదావరి బోర్డు ఏపీ ఇరిగేషన్‌శాఖకు పంపి సమాధానాన్ని కోరింది. పట్టిసీమ పోలవరంలో భాగమేనని, పోలవరం పూర్తికాగానే పట్టిసీమను రద్దు చేస్తామని ఏపీ ఇరిగేషన్‌వర్గాలు సమాధానమిచ్చాయి.

No comments:

Post a Comment