Friday, 18 September 2015

వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు సాగునీరు అందించేందకు

రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు - సీఎం చంద్రబాబు 
Updated :18-09-2015 12:12:40
 విజయవాడ, సెప్టెంబరు 18 : రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. బోగస్‌ కార్డు ఏరివేశామన్నారు. ఎక్కడా కూడా విద్యుత్‌ కోతలు విధించడానికి వీల్లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు  సాగునీరు అందించేందకు విధానం రూపొందిస్తామన్నారు. నదుల అనుసంధానం చేసిన రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. గ్రామాలకు నీళ్లు ఎలా వెళ్లాలనేది కలెక్టర్లు చూడాలని కోరారు. కలెక్టరు అని బ్రిటీషు వాళ్లు పెట్టిన పేరును మార్చాలని, దీనిపై దేశంలో చర్చ జరగాలన్నారు. 15,500 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందని దీనిపై అధికారులు దృష్టి సారించి వనరులను పెంచుకోవాలని సీఎం
ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో నిధులను సక్రమంగా వినియోగించుకునేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.

No comments:

Post a Comment