నీటి జగడాలపై జాగ్రత్త
Updated : 1/20/2015 1:52:44 AM
Views : 284
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదీజలాల కేటాయింపులకు ఉద్దేశించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను రెండేళ్ళు పొడిగించింది. ఇటీవల ట్రిబ్యునల్ ప్రాథమిక అంశాలుగా తొమ్మిదింటిని ఖరారు చేసింది. వాటి పై ఫిబ్రవరి 25-27 తేదీల్లో తెలంగాణ తన వాదన వినిపించాల్సి వున్నది. ఇంకా విభజన చట్టం ప్రకారం కృష్ణా నది అజమాయిషీ బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నది అజమాయిషీ బోర్డు(జీఆర్‌ఎంబీ)లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులనూ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఉంటే వాటినీ అమలు జరిగేట్టు చూడడం ఈ బోర్డుల పని. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన జూన్ 2 2014 నుంచి 60 రోజుల్లోపుగా ఏర్పాటు చేయాలని వుంటే, మే 28వ తేదీనాడే రెండు బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సీమాంధ్రుల ఒత్తిడే ముఖ్యకారణం.
సీమాంధ్ర ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం విభజన చట్టం ద్వారా దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలోనూ చేయని పద్ధతిలో, పోలవరం ముంపు గ్రామాలను పోలవరం డ్యాం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది. ఆ తరువాత ఆర్డినెన్స్ ద్వారా ఏకంగా ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను ఆ రాష్ట్రంలో కలిపేసింది. ఇప్పుడు బూర్గంపహాడ్ పట్టణాన్ని కలుపుకునే ప్రయత్నం సాగుతున్నది. డ్యాం ఎత్తును 186 అడుగులకు పెంచాలని అడుగుతున్నారంటే, సగానికి పైగా ఖమ్మం జిల్లానే కబళించాలన్న ఎజెండా కనబడుతున్నది. ఇంకా కొత్తగా పోలవరం దగ్గరలో పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ తెరపైకి తెచ్చి గోదావరినది నుంచి 80 టీఎంసీల నీళ్ళను కృష్ణానది ప్రకాశం బారేజీకి మళ్లించడానికి 1300కోట్లు ఇస్తూ ఈ నెల జీవో ఇచ్చుకున్నారు. మహారాష్ట్ర తెలంగాణలకు పరిమితమైన బాబ్లీ ప్రాజెకుకు చెందిన సుప్రీంకోర్టు ప్రతిపాదిత కమిటీలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగస్వామిగా ఉంటానని పట్టుబడుతోంది. ఇటువంటి సీమాంధ్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇకముందు కూడా కొనసాగుతూనే ఉంటాయి.
నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. తెలంగాణకు అనుసంధానం ద్వారా అదనంగా వచ్చేది 82టీఎంసీలవుతే కోల్పోయేది దాదాపుగా 500టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్ తమ అక్రమ ప్రాజెక్టులను అనుసంధానం ద్వారా సక్రమం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. తెలంగాణ తన వాదనలను గణాంకాలతో సహా బలంగా వినిపించాల్సి ఉన్నది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖలు రాయడంతో వాటిపై తెలంగాణ ప్రతిస్పందన లేకుండానే కృష్ణా బోర్డు తన నిర్ణయాలు ప్రకటించినట్లు తెలిసింది. తరువాత ఇరు రాష్ర్టాల ఇంజినీర్ల, అధికారుల మధ్య జరిగిన సమావేశాల్లో తెలంగాణకు ప్రతికూల నిర్ణయాలు జరిగుతున్నట్లు పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బోర్డు ఛైర్మన్ పండిత్ గారిని అభ్యర్థించి తెలంగాణ తరఫున ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు కూడా బోర్డు సమావేశాల్లో పాల్గొంటారని కోరారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పరస్పరం సంప్రదించుకొని తెలంగాణ ఆలోచనా విధానాన్ని బోర్డు ముందు సమర్థవంతంగా ఉంచారు ప్రభుత్వ సలహాదారు.
ఇన్నేళ్ళుగా అవగాహనలేకుండా, పట్టించుకోకుండా వున్న విషయాలన్నీ వెలికి తీసి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి వాటాకు మించి వాడిన వైనాన్ని తెలంగాణ ప్రభు త్వం బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా తెలియజేశారు. ఆ తరువాత బోర్డుకూడా సావధానంగా వ్యవహరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ దూకుడుకు అడ్డుకట్ట పడింది.
కృష్ణా నదిపై ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ ముందైనా, ఇప్పటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందైనా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం సరిగా వాదించలేదు. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్‌కు నీళ్ళందించే విషయంలో ఈ లోపాన్ని ఎత్తి చూపింది. ట్రిబ్యూనల్ జూరాల ప్రాజెక్టుకు సానుభూతితో నీటి కేటాయింపు చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా రాష్ర్టాల పునర్వ్వ్యవస్థీకరణ వల్ల నష్టపోయిందని చెబుతూ ఈ నీటిని జూరాలలోవీలు కాకుంటే తెలంగాణలో మాత్రమే వాడాలని పేర్కొం ది. అట్లాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్‌లోనే వున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ లకు కేటాయింపుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రంగా ప్రస్తావించింది అని పేర్కొని ఒక్క టీఎంసీ కూడా కేటాయించలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 43 శాతం నీటిని బేసిన్ అవతల వాడుకుంటున్నది. దానివల్ల నీళ్ళతోపాటుగా రిటర్న్ ఫ్లోస్ పరంగా కూడా బేసిన్‌కు నష్టం జరుగుతుంది. అయినా ఇంకా కృష్ణాబేసిన్‌కు పూర్తిగా ఆవలనున్న తెలుగుగంగ ప్రాజెక్టుకై కేటాయింపులు చేయాలని చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతున్నందువల్ల 25 టీఎంసీలు కేటాయిస్తున్నాం అని పేర్కొంది.
గత బచావత్ ట్రిబ్యూనల్ రాజోలిబండ ఆనకట్టకు డైవర్షన్ స్కీం నుంచిఎడమవైపుకు(అంటే తెలంగాణకు) మాత్రమే కేటాయించి కుడివైపును (అంటే సీమాంధ్రను) నిర్లక్ష్యం చేశారు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించి నాలుగు టీఎంసీల నికర జలాలను కేటాయింపజేసుకుంది. ఆర్డీఎస్‌కు ప్రతిగా సీమాంధ్రకు కేటాయింపులకై వాదించిన ఉమ్మడి ప్రభుత్వం కేసీ కెనాల్‌కు ప్రతిగా తెలంగాణకు కేటాయింపులకై వాదించలేదు.
ఇక రాష్ట్ర విభజన చట్టం, 2014 కూడా జలవనరుల్లో మనకు ప్రతికూలమైన అంశాలెన్నో సీమాంధ్ర ఒత్తిడి వల్ల చేర్చబడ్డాయి. బోర్డులు చూడాల్సిన కట్టబడుతున్న ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్‌కు ఆవలనున్న సీమాంధ్రకు చెందిన అక్రమ ప్రాజెక్టులు వెలిగొండ, గాలేరునగరి, తెలుగుగంగ, హంద్రీనీవా లను పేర్కొంటూ తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడులను మాత్రమే పేర్కొన్నారు. బేసిన్‌లోనే ఉన్న తెలంగాణ ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ నిగానీ, కేటాయింపులున్న కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను గానీ పేర్కొనలేదు. విభజన చట్టం సెక్షన్ 89 ద్వారా పొడిగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిని పెంచాలి. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు పరంగా అవసరాలు గుర్తించినప్పటికీ, ఒక రాష్ర్టా నికి కేటాయింపులను ఏకమొత్తంగా భావించినందువల్ల ఎగువ రాష్ట్రంగా కర్ణాటక ఆల్మట్టి విషయంలో లాభపడింది. తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రంగా మారింది కాబట్టి తన రక్షణలను స్పష్ట పరచాలి.
డెఫిసిట్ ఫ్లోస్ (కేటాయింపులకంటే తక్కువ ప్రవాహం)ను పంచడాన్ని వ్యతిరేకించాలి. ఆంధ్ర ప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ ముందు స్కీమ్-బీ ని వ్యతిరేకించింది స్కీమ్-ఏ ని కోరుకొంది. అంటే సర్ ప్లస్ ఫ్లోస్ (కేటాయింపులకంటే అధిక ప్రవాహం) వున్నప్పుడైనా, డెఫిసిట్ ఫ్లోస్ వున్నప్పుడైనా ఎగువరాష్ర్టాలు తమ వాటా వాడుకున్న తరువాతే మిగిలిన నీటిని ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చు (హక్కుగా కాదు).బ్రిజేష్ ట్రిబ్యునల్ కు కూడా హక్కు కోరమని రాత పూర్వకంగా ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇప్పుడు లోటును ఎగువ రాష్ర్టాలకు కూడా పంచాలనడం వల్ల తెలంగాణ ఒక ఎగువ రాష్ట్రంగా నష్టపోయ ప్రమాదం వున్నది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఒకసారి గెజిట్ లో ప్రచురించబడితే తిరిగి 2050 సంవత్సరం వరకు పునఃసమీక్ష ఉండదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను విభజన చట్టం ద్వారా పొడిగించినందువల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
పైన పేర్కొన్న విషయాలన్నింటి దృష్ట్యా కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన విషయాలను, అంతర్రాష్ట్ర జలవనరులకు చెందిన అన్నీ అంశాలను పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. అంతర్రాష్ట్ర జలవనరుల విభాగానికి హైడ్రోలోజీ విభాగానికి చెందిన అధికారులు, బోర్డులో తెలంగాణ ఇంజనీరింగు ప్రతినిధియైన ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగానికి సాంకేతిక సలహా కమిటీ సభ్యులు, నీటిపారుదల రంగంలో ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదలశాఖ న్యాయవాదులు అందరూ అందులో సభ్యులుగా ఉండాలి. వారి సమావేశాలకు అవసరాన్ని బట్టి ఆయా ప్రాజెక్టుల, జిల్లాల, విభాగాల చీఫ్ ఇంజినీర్లను, సంబంధిత ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను కూడా ఆహ్వానించాలి. సాంకేతిక సలహా కమిటీని అధికారికంగా నియమించుకోవాలి. ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారుకు అంతర్రాష్ట్ర నదుల విషయమై క్షుణ్ణమైన అవగాహన కలిగి, కేంద్ర జలవనరుల శాఖలో ఉన్నతస్థానంలో పనిచేసిన అనుభవం ఉన్నందున ఆయన ఛైర్మన్ గా ఈ వ్యవస్థ పనిచేయడం శ్రేయస్కరం.
వైద్యనాథన్ లాంటి మంచి లాయర్లను నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే వారికి అందించే సమాచారం సమగ్రమైనదిగా ఉండాలి. కొందరు తెలంగాణ సోయిలేని తెలంగాణ అధికారులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణేతర జోన్ల నుంచి తెలంగాణకు కేటాయించబడ్డవారు, ఆంధ్రమూలాలు గలిగిన ఇంజినీర్లు ఇంకా కీలక స్థానాల్లో కొనసాగుతూ ఉండడం పట్ల తెలంగాణవాదులు ఆవేదన చెందుతున్నారు. పక్కా తెలంగాణ సోయి, తెలంగాణ తపన, నిబద్ధత ఉన్న వారే కీలకమైన జలవనరుల శాఖలో కీలక స్థానాల్లో ఉండాలని, అట్లా అయితేనే తెలంగాణాకు న్యాయం జరిగి, భవిష్యత్తులో మనం కోరుకున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

-సల్లా విజయకుమార్
తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ సెక్రెటరీ
తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ సెక్రెటరీ
No comments:
Post a Comment