Friday, 11 September 2015

కృష్ణమ్మ ఒడి చేరేందుకు గోదావరి పరవళ్ళు

కృష్ణమ్మ ఒడి చేరేందుకు గోదావరి పరవళ్ళు 
Updated :11-09-2015 09:50:56

కృష్ణమ్మ ఒడి చేరేందుకు గోదావరి పరవళ్ళు 
Updated :11-09-2015 09:50:56
హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌: కృష్ణమ్మ ఒడిని చేరేందుకు గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. గురువారం బాపులపాడు మండలం రంగన్నగూడెం, వీరవల్లి గ్రామాల్లో గోదారమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగింటి మహిళలు హారతులు ఇచ్చారు. పోలవరం కుడి కాలువ 129వ కిలోమీటర్‌ వద్ద పయనించి వస్తున్న గోదావరినీటికి రైతులు, మహిళలు పెద్దఎత్తున పూజాదికాలు జరిపారు. మేళతాళాలు, బాణాసంచాలతో ఊరేగింపుగా కాలువవద్దకు చేరి గోదావరి తల్లిని సాద రంగా ఆహ్వానించారు.
 
మల్లవల్లి, సింగన్నగూడెం, వీరవల్లి, రేమల్లె, వేలేరు, కోడూరుపాడు గ్రామాలనుంచి పెద్దఎత్తున రైతులు, మహిళలు పోలవరం కాలువ వద్దకు చేరి గోదావరి నీటి ప్రవాహాన్ని చూసి పులకించారు. కాలువలో దిగి కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ, 69 సంవత్సరాల సుదీర్ఘప్రస్థానంతో పెండింగ్‌లో ఉన్న పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అంతర్భాగంగా పట్టిసీమ పథకాన్ని ఏర్పాటు చేసి కేవలం 69రోజుల వ్యవధిలో పనులు పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మాత్రమేనని అన్నారు.
 
రైతులు భాగస్వామ్యంతో పట్టిసీమ ద్వారా జిల్లాకి గోదావరి నీటిని తరలించటంలో చంద్రబాబు సఫలీకృతుడయ్యారని జడ్పీ మాజీ చైర్మన్‌ కడియాల రాఘవరావు అన్నారు. సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ళ వెంకటగోపాలకృష్ణ, ఆయన భార్య మణికృష్ణ దంపతులు పెద్దఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించి, అతిథులు అందరికి ఆహ్వానం పలికారు. భూసేకరణలో రైతులను సమన్వయపరిచి పనులుత్వరగా పూర్తిచేసేందుకు కృషిచేసిన పోలవరం భూసేకరణకమిటీ జిల్లాసభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణను వేములపల్లి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.
 
రైతు నాయకుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ, పోలవరం కుడి కాలువ కింద భూమి కోల్పోయిన గ్రామాల్లో గోదావరినీరు రావడం తమకు పండుగవాతావరణం చోటుచేసుకుందని, దీనిని రికార్డుస్థాయిలో పూర్తిచేసిన సీఎం చంద్రబాబు నాయుడికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. బాపులపాడు ఎంపీపీ తుమ్మల కోమలి, పోలవరం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చినబాబు, మాజీ ఎంపీపీ తట్టి అర్జున్‌రావు, డిప్యూటి ఈఈ పద్మిని దేవి, దయాల రాజేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తుమ్మల దశరధరామయ్య, మొవ్వా శ్రీనివాసరావు, గరికపాటి శ్రీనివాసరావు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment