Saturday, 26 September 2015

పోలవరం జాతీయ ప్రాజెక్టే అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు

పోలవరం జాతీయ ప్రాజెక్టే అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు : కేంద్ర మంత్రి
Updated :24-07-2015 01:21:59
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉందా? లేదా?, దాని నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత?, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఎంత? ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చాయా? లేదా? అంటూ విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్లమెంటులో గురువారం ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సన్వర్‌లాల్‌ జత్‌ సమాధానమిచ్చారు. సెక్షన్‌ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. 2010-11 ప్రకారం రూ.16,010.45 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటివరకు దీనిపై రూ.5,575 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేంద్రం 2014-15లో రూ.250 కోట్లు, 2015-16లో రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్ట్‌కు ఎనిమిది రకాల అనుమతులు వచ్చాయన్నారు. పోలవరాన్ని మార్చి 2018 నాటికి పూర్తిచేయాల్సి వుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌కు, పోలవరానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని మే 28, 2014న ఏర్పాటుచేయగా ఇది ఈ ఏడాది జనవరి నుంచి పనిచేస్తోందని చెప్పారు. 

No comments:

Post a Comment