పట్టిసీమ ద్వారా 7.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడుతాం : దేవినేని Updated :24-09-2015 17:02:03 |
విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాల తరలింపుతో కృష్ణా డెల్టాలో మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుతామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు మంచినీరివ్వడం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన విమర్శించారు. అలాగే సాగునీటి సంఘాలను పరిపుష్టి చేస్తామని, కాంగ్రెస్ హాయంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరపలేదన్నారు. దీనిద్వారా సాగునీటి సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు.
|
No comments:
Post a Comment