Irrigation Projects

Wednesday, 16 September 2015

పట్టిసీమపై తెలంగాణ పట్టు

పట్టిసీమపై తెలంగాణ పట్టు

Thu 27 Aug 03:59:15.822953 2015
- గోదావరి బోర్డు సమావేశంలో 
ఇదే కీలకం
- కాళేశ్వరంపై ఆంధ్రప్రదేశ్‌ నివేదిక
- నిధులు విధులపైన చర్చ
- 29 న సమావేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన వివాదాస్పద పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. ఈ నెల 29 న జరగబోయే గోదావరి బోర్డు సమావేశంలో ఈ అంశం కీలకం కానుంది. దీనికి ప్రతిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలపడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక నోట్‌ తయారు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడి ఎత్తిపోతల పథకంపై కేంద్ర జలసంఘానికి ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టిఎమ్‌సిల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడానికి గతంలోనే గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్‌ ముందు మూడు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందనే నెపంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి కింది భాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి దీని ద్వారా 80 టిఎమ్‌సిల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడానికి రూపకల్పన చేసింది. ఈ పథకానికి ఈనెల 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం కూడా చేశారు. కేంద్ర జలసంఘంతో పాటు పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ. ప్రణాళికా సంఘం అనుమతులను తీసుకోకుండా నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకే పూర్తిస్థాయి అనుమతులు రాని పరిస్థితుల్లో దీని కిందిభాగంలో మరో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం చట్ట విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరి స్తోందని తెలంగాణ వాదిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సమర్ధించుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఇది కేవలం తాత్కాలిక ప్రాజెక్టుగా అభివర్ణించడమే కాక పోలవరం ప్రాజెక్టులో భాగమని ప్రకటించుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టిసీమను రద్దు చేసుకుంటామని కూడా తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టిఎమ్‌సిల నీటిలో 45 టిఎమ్‌సిలు ఆంద్ర óప్రదేశ్‌ రాష్ట్రం వినియోగించుకుంటే మిగిలిన 35 టిఎమ్‌సిల నీటిని ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర వినియోగిం చుకునే విధంగా గతంలో ఒప్పందం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన 45 టిఎమ్‌సిల్లో సగం వాటా తమకు రావాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు తెలిపింది. తమ వాటా సంగతి తేల్చకపోవడమే కాక అటు గోదావరి బోర్డుకు కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడం అన్యాయమని తెలిపింది.
కాళేశ్వరంపై ఆంధ్రప్రదేశ్‌ నోట్‌
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కాశేశ్వరం ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక నోట్‌ తయారు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని 14 లక్షల ఎకరాలకు నీరందిం చడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఇంకా పాలనాపరమైన అనుమ తులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వక పోయినా ముంద స్తుగానే తమ అభ్యంతరాలను తెలపడానికి ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించింది. పట్టిసీమపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తిన తరుణంలో వ్యూహాత్మకంగా కాళేశ్వరం వ్యవహారాన్ని తెరపైకి తేవాలని ఆ రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించుకోవడానికి గతంలో అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగినప్పటికీ ఇప్పుడు ప్రాణహిత సబ్‌ బేసిన్‌లో కాకుండా కింది భాగంలోని జి 10 సబ్‌ బేసిన్‌లో కాళేశ్వరం నిర్మించడానికి తమ అనుమతి అవసరమని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయ పడుతోంది. గోదావరి నీటిలో సబ్‌ బేసిన్‌ల వారీగా కేటాయింపులు ఉండడంతో ఈ అంశాన్ని ప్రత్యే కంగా ప్రస్తావించాలని ఆ రాష్ట్రం నిర్ణయించింది. గోదావరి నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న ఇందిరాసాగర్‌ రుద్రమకోట ఎత్తిపోతల పథకంపై కూడా చర్చ జరగనుంది. ఉమ్మడి రాష్ట్రం లో మంజూరు చేసిన ఈ ఎత్తిపోతల ద్వారా ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరందిం చాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకం హెడ్‌ వర్క్స్‌ ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతమైన వేలేరుపాడు మండలంలో ఉంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా గుర్తించి దీనిని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభు త్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ఒక లేఖ రాసింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
బోర్డు నిర్వహణపైనా చర్చ
గోదావరి బోర్డు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం గడచినా ఇప్పటి వరకూ బోర్డు నిర్వహణకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. బోర్డు పనిచేయడానికి అవసరమైన పిబ్బందిని రెండు రాష్ట్రాలు కేటాయించాలి. అంతే కాకుండా దీని నిర్వహణకు అయ్యే బడ్జెట్‌ను కూడా రెండు రాష్ట్రాలు సమకూర్చాలి. బోర్డు పనిచేయడానికి అవసరమైన కార్యాలయ స్థలం కేటాయింపు అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి బోర్డులు రెండూ స్థానిక జలసౌధలోనే కొనసాగుతున్నాయి.
Posted by khanyazdani at 03:46
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Blog Archive

  • ►  2025 (4)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  January (1)
  • ►  2024 (8)
    • ►  September (5)
    • ►  August (3)
  • ►  2022 (2)
    • ►  September (1)
    • ►  February (1)
  • ►  2021 (12)
    • ►  July (7)
    • ►  June (2)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (18)
    • ►  August (1)
    • ►  June (2)
    • ►  May (15)
  • ►  2019 (2)
    • ►  October (1)
    • ►  August (1)
  • ►  2017 (4)
    • ►  December (1)
    • ►  October (1)
    • ►  May (1)
    • ►  January (1)
  • ►  2016 (17)
    • ►  June (10)
    • ►  May (1)
    • ►  March (5)
    • ►  February (1)
  • ▼  2015 (33)
    • ►  November (2)
    • ►  October (4)
    • ▼  September (22)
      • పోలవరం జాతీయ ప్రాజెక్టే అంచనా వ్యయం రూ.16,010.45 క...
      • Indirasagar (Polavaram) Project, A.P
      • Polavaram project estimates raised to Rs. 7,332 cr
      • తెలంగాణలో నీటిపారుదలా ప్రాజెక్టులు
      • పట్టిసీమ ద్వారా 7.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడుతా...
      • పట్టిసీమ వివాదాలు పెరుగుతున్నాయ్.
      • 400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి
      • గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు
      • గోదావరిపై కొత్త ప్రాజెక్టులు
      • వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు సాగునీరు అం...
      • పట్టిసీమపై తెలంగాణ అభ్యంతరాలేమిటి?:బోర్డు
      • పట్టిసీమపై తెలంగాణ పట్టు
      • పట్టిసీమను అడ్డుకోండి గోదావరి బోర్డుకు టీ సర్కారు ...
      • అబద్ధాల పట్టిసీమ !
      • పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే
      • నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం వితండవాదం
      • నీటి జగడాలపై జాగ్రత్త
      • ఈనెల 16న పట్టిసీమ ప్రారంభోత్సవం
      • కృష్ణమ్మ ఒడి చేరేందుకు గోదావరి పరవళ్ళు
      • The big picture
      • List of Reservoirs in AP & Telangana
      • Reservoir Storage Monitoring System
    • ►  August (2)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  March (1)
  • ►  2013 (9)
    • ►  September (3)
    • ►  August (6)

About Me

My photo
khanyazdani
View my complete profile
Simple theme. Powered by Blogger.