Wednesday, 16 September 2015

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే
తెలంగాణ అభ్యంతరం సరికాదు
గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ సమాధానం

Updated :05-08-2015 01:38:30
  • ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టూ కాదు.. కొత్తదీ కాదు
  • తెలంగాణ అభ్యంతరాల్లో అర్థం లేదు
హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్‌ రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని.. ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవ డం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్ర భుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను ఏపీ ప్ర భుత్వానికి బోర్డు పంపింది. ఈ సమయంలో తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలతో కూడిన లేఖ ప్రతిని జత చే సింది. ఈ లేఖపై ఏపీ సర్కార్‌ చాలా ఘాటుగా.. తార్కికంగా సమాధానం ఇచ్చింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందో గ్రహించాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ భూభాగమే ఉందని.. మరో 30 కిలోమీటర్లలో ఈ నీరంతా సముద్రంలో కలుస్తుందని గుర్తెరగాలని పేర్కొంది. పొరుగున ఉన్న ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాలతో పట్టిసీమ ప్రాజెక్టుపై వివాదం లేదని స్పష్టం చేసింది. పట్టిసీమ వద్ద నుంచి నీరు ఎగువ రాష్ట్రాలకు వెళ్లదని కూడా గ్రహించాలని సూచించింది. సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగానే నిర్మిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పేచీ ఉందని.. పట్టిసీమ విషయంలో ఎలాంటి పేచీలూ లేవని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందిస్తున్నామని వివరించారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు కొంతమేర ‘గ్రావిటీ’తోనూ.. మరికొంత మేర ‘పంపింగ్‌’ ద్వారా నీటిని పంపుతున్నారని.. ఇలా రెండు విధాలుగా పంపుతున్నంత మాత్రాన.. రెండు ప్రాజెక్టులు అవుతుందా అని ప్రశ్నించారు. పోలవరం కింది భాగాన పట్టిసీమను తాత్కాలికంగా నిర్మిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే దీనిని తొలగిస్తామని కూడా వివరించారు. నీరు పల్లమెరుగు అనే సామెతను గుర్తు చేసుకోవాలని.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద నుంచి నీరు ఎగువ రాష్ట్రానికి వెళ్లదని.. కిందనున్న సముద్రంలో కలుస్తుందని తెలిపారు. అందువల్ల ఈ ప్రాజెక్టుపై వెలిబుచ్చే అభ్యంతరాలకు అర్థమే లేదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఏపీ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment