Wednesday, 11 September 2013

పోలవరానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

పోలవరానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

September 11, 2013
హైదరాబాద్, సెప్టెంబర్ 11 : పోలవరంప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. పోలవరానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. పోలవరం టెండర్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను బుధవారం ఉదయం హైకోర్టు కొట్టివేసింది. పోలవరం టెండర్లను ప్రభుత్వం అనుభవం లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు అప్పగించిందంటూ సోమా కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం కేటాయించిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి అనుకూలంగా ఉన్నతన్యాయస్థానం తీర్పునిచ్చింది.

No comments:

Post a Comment