Tuesday 20 September 2022

Polavaram RR Package

 Published: Tue, 20 Sep 2022 03:13:03 ISTహోంఆంధ్రప్రదేశ్పోలవరంపై నిండు సభలో బొంకులు!twitter-iconwatsapp-iconfb-iconపోలవరంపై నిండు సభలో బొంకులు!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750అబద్ధాల సీరియల్‌ 3.0

నిర్వాసితులకిచ్చిన మాట మార్చేశారునిర్వాసితులందరికీ 10 లక్షలిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ వాగ్దానంఇప్పుడు సభలో నాలుక మడత

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితులకు భూపరిహారం చెల్లింపులో నిండు సభలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు బొంకులతో బుకాయింపులకు దిగారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎకరాకు ఇస్తున్న రూ.6.5 లక్షలు చాలడం లేదని.. తాను అధికారంలోకి వస్తే రూ.పది లక్షల చొప్పున ఇస్తానని ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. 2021 జూన్‌ 30వ తేదీన పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపుపై ఉత్తర్వు జారీ చేశారు. అయినా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇచ్చిన మాట మేరకు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ఎకరాకు పది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రతిపక్షం అసెంబ్లీలో డిమాండ్‌ చేసింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభలో దీనిపై చర్చ జరిగింది. ఎకరాకు పది లక్షల రూపాయలిస్తామని జగన్‌ ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి అంబటి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్పష్టం చేశారు.

అయితే సీఎం జోక్యం చేసుకుని.. పది లక్షల పరిహారంపై తాను హామీ ఇచ్చానని.. ఆమేరకు 2021 జూన్‌ 30వ తేదీన జీవో ఇచ్చానని చెప్పారు. గతంలో ఏం మాట ఇచ్చామో దానికి కట్టుబడి ఉన్నామన్నారు. డ్యాం పూర్తయ్యాక మొదట డ్యాం భద్రత దృష్ట్యా నీటిని 41.15 మీటర్ల కాంటూరులో నిల్వ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు గాను 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 20,946 కుటుంబాలు వస్తాయని.. మిగిలిన 85,060 కుటుంబాలు 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోకి వస్తాయని తెలిపారు. వీరిలో 41.15 మీటర్ల కాంటూరు లెవల్‌కు వచ్చే 14,110 కుటుంబాల పునరావాసం రూ.1,960.95 కోట్లతో పూర్తయుందని వెల్లడించారు. ‘ 2019 నుంచి ఇప్పటి వరకూ 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1,773 కోట్లు ఖర్చు చేశాం. 41.15 కాంటూరు వరకూ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుంబాలను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తాం. ఈ 6,836 కుటుంబాలకు ఎకరాకు పది లక్షల చొప్పున చెల్లించేందుకు రూ.500 కోట్లు మాత్రమే ఖర్చవుతాయి. వీటిని చెల్లిస్తాం’ అని వెల్లడించారు. ఎకరాకు లక్షన్నర చొప్పున చెల్లించిన వారికి మరో మూడున్నర లక్షలు చెల్లిస్తామని జగన్‌ చెప్పారు.

వారికి మొండిచేయే! ముఖ్యమంత్రి ప్రసంగాన్ని పరిశీలిస్తే.. కేవలం 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని 20,946 కుటుంబాలకు మాత్రమే ఎకరాకు రూ.పది లక్షలు ఇస్తాయన్న మాట. 45.72 మీటర్ల కాంటరు పరిధిలోని వచ్చే మిగతా 85,060 కుటుంబాలను గాలికి వదిలేసినట్లే! వారికి పది లక్షలు ఇవ్వబోవడం లేదని చెప్పకనే చెప్పేశారు. తమకు రూ.6.5 లక్షలే వస్తున్నాయని.. అని చాలడం లేదని నిర్వాసితులు చెప్పారని.. దాంతో వారు పరిహార దీక్ష చేస్తున్నప్పుడు తాను అధికారంలోకి వస్తే ఎకరాకు పది లక్షలిస్తానని చెప్పానని.. ఇప్పుడు ఎన్నికల సభలోనూ అదే హామీ ఇస్తున్నానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ స్పష్టం చేశారు. అయితే పరిహార దీక్షలో గానీ.. ఎన్నికల ప్రచారంలో గానీ ఎక్కడా 41.15 మీటర్లకే పరిమితమవుతామని ఆయన చెప్పలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. 41.15 మీటర్ల కాంటూరుకే అంటే.. 20,946 కుటుంబాలకే ఎకరాకు పది లక్షలు చెల్లిస్తామని ఆయ న చెప్పడం విస్తుగొల్పుతోంది. జగన్‌ మరోసారి మాటమార్చా రని.. మడమ తిప్పేశారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

No comments:

Post a Comment