Monday 5 July 2021

Krishna river water dispute

 జల వివాదంలో నలుగుతున్న రైతులు


Jul 5 2021


కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టులో ఆందోళన

వచ్చిన నీటినీ వాడుకోలేని ఏపీ సర్కారు 

ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా నీరు

కాల్వలు ఎండగట్టి.. సముద్రంలోకి!

ప్రాజెక్టుల్లో ప్రతి చుక్కా ముఖ్యమే!

కాపాడుకోవాలంటున్న రైతులు, నిపుణులు

సామరస్య పరిష్కారం కోసం ఎదురుచూపులు


పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వరుసగా మూడేళ్లు జూన్‌ నెల మొదటి వారంలోనే కృష్ణా డెల్టాకు నీటిని అందించగలిగారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టిసీమను పట్టించుకోలేదు.  ఆ ఏడాది జూలై చివరిలో పట్టిసీమ నుంచి నీటి విడుదల చేశారు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి.

(విజయవాడ, నరసరావుపేట, తెనాలి-ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యం నీరై పారుతోంది. కాల్వలకు.. అక్కడి నుంచి చెరువులకు, పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. రెండేళ్లు నిండితే.. ఏడాది ఎండిపోయే కృష్ణా ప్రాజెక్టుల నుంచే నీరు వృథా అవుతోంది. దీంతో.. మున్ముందు పంటలకు నీళ్లు అందుతాయో లేదోనని సాగర్‌ ఆయకట్టు, ఇటు కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రస్తుతం జూరాల నుంచి పులిచింతల వరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. పులిచింతల నుంచి వదిలిన నీరు నేరుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని చేరుతోంది. ఈ బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు మాత్రమే. అంతకు మించి వచ్చిన నీటిని కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు అందించాలి. లేదా.. సముద్రంలోకి వదిలేయాలి. ఇప్పుడు.. నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కాల్వల ద్వారా సాగుకు నీళ్లు విడుదల చేయడం లేదు. గత 3 రోజుల్లో 1.5 టీఎంసీలకు పైగా జలాలను సముద్రంలోకి వదిలేసింది. సాగునీటికి లాకులెత్తలేదు. సోమవారం నుంచి విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.


కాల్వల్లో కన్నీరు: గతంలో కృష్ణా డెల్టాలో జూలై మొదటివారంలో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యేవి. పంట చేతికి వచ్చే సరికి నవంబరు వచ్చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి తరచూ తుఫాన్లు విరుచుకుపడటంతో పంటలు దెబ్బతినేవి. ‘పట్టిసీమ’ రూపంలో 2016 నుంచి ఈ దుస్థితి తప్పింది. జూన్‌ మొదటి వారంలోనే కాల్వలకు నీరు విడుదల చేసేలా గత టీడీపీ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. అయితే... పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణం కారణంగా పట్టిసీమ నీరు ఇప్పట్లో ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం లేకుండా పోయింది. అదే సమయం లో.. తెలంగాణ సర్కారు జలవిద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటిని వేర్వేరు కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి నీటి విడుదల ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. మూడు రోజుల క్రితం ఐఏబీ సమావేశం నిర్వహించి.. సోమవారం కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈలోపు వచ్చిన నీటిని మాత్రం వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితిపై  రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సాగర్‌ ఆయకట్టుదీ అదే కథ..

కృష్ణా డెల్టా రైతులది ఒక వ్యథ అయితే.. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉన్న నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులది మరో కథ! సాగర్‌ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌ నిండి కాల్వల్లోకి నీరు ప్రవహిస్తేనే ఇక్కడ పంటలు పండేది. ప్రస్తుతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదు. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండి.. అక్కడ గేట్లు ఎత్తితేనే సాగర్‌ చెంతకు కృష్ణమ్మ చేరుతుంది. అయితే, ‘జల విద్యుదుత్పత్తి మా హక్కు’ అంటూ తెలంగాణ సర్కారు దూకుడుగా ముందుకు వెళుతోంది. సాగర్‌ నుంచి ఇప్పటికి 26.95 టీఎంసీల నీటిని జల విద్యుదుత్పత్తి కోసం కిందికి వదిలేసినట్లు ఏపీ అధికారులు అం చనా వేస్తున్నారు. ఆదివారం సాగర్‌ నుంచి 62,134 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 21,189 క్యూసెక్కులు, పులిచింతల నుంచి 7,200 క్యూసెక్కులను జలవిద్యుత్తు కోసం వదిలారు. ఇప్పట్లో జల జగడం సద్దుమణిగే అవకాశం కనిపించడంలేదు. అంటే.. జలవిద్యుదుత్పత్తి రూపంలో మరింత నీరు దిగువకు పోతూనే ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఇప్పటికైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇది దారుణం!

పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి ద్వా రా విడుదలవుతున్న నీటిని సముద్రంలో కి వృథాగా వదలడం కంటే డెల్టాకు విడుదల చేస్తే ప్రయోజనం ఉండేది. నారుమడులు కాస్త ముందుకు జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేయడం అనైతికం.  ఆ నీటిని మన ప్రభుత్వం సముద్రంలోకి వదలడం దారుణం. 

- ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, సాగునీటి 

వినియోగదారులసమాఖ్య గౌరవాధ్యక్షుడు

వారు అడగకపోవడం వల్లే

నీటి విడుదల కోసం ప్రకాశం బ్యారేజీదిగువ ప్రాంతాల నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. కాల్వలకు ఎప్పుడు నీరు విడుదల చేయాలన్న దానిపై నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సాగుకు ఈ నెల 5 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు డెల్టా కాల్వలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నాం. 

- వరప్రసాద్‌, ప్రకాశం బ్యారేజీ డీఈ


Jul 5 2021 @ 13:43PMహోంఆంధ్రప్రదేశ్జల జగడంపై కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ లేఖఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను విద్యుదుత్పత్తికి వాడుకుంటోందని, కేఆర్‌ఎంబీ ఆదేశించినా వినకుండా జలాలను వినియోగించుకుంటోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన 34 జీవో పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. రాయలసీమకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, అదనపు ఆయకట్టు లేదని, కేటాయించిన నీటినే వాడుకుంటామన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేఆర్‌ఎంబీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ పథకాలు నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అక్రమ ప్రాజెక్టులను సందర్శించి నిలిపివేయాలని కోరినా కేఆర్‌ఎంబీ వెళ్లలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వద్దకు వస్తామని లేఖలు రాస్తున్నారని, తమ వద్దకు వచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించాల్సిందేనని  సీఎం జగన్‌ అన్నారు.

అక్కడ ప్రాజెక్టులను సందర్శించకుండా ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలని, రిజర్వాయర్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. తటస్థంగా ఉండాల్సిన కేఆర్‌ఎంబీ అధికారులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కేఆర్‌ఎంబీ అధికారులకు తగిన సూచనలు చేయాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆ లేఖలో కోరారు.




No comments:

Post a Comment