Friday, 2 July 2021

Krishna Water dispute

 కృష్ణా నీళ్లు కడలిపాలు!

Jul 2 2021 


జలాశయాల్లో అడుగంటిన నీరు..


తెలంగాణ నిర్వాకంతో సముద్రంలోకి వృథాగా జలాలు


అక్రమ విద్యుదుత్పత్తితో సాగుకు చేటు..


ఆందోళనలో కృష్ణా డెల్టా రైతాంగం




అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. ఎగువనుంచి వరద కోసం ఎదురు చూస్తున్నాయి. ఖరీఫ్‌ మొదలు కావడంతో కృష్ణా ప్రాజెక్టులపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు పెద్దగాప్రభావం చూపకపోవడంతో రాష్ట్రంలో వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తోడేస్తోంది. ఆ నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయడంతో సరిపెట్టకుండా.. అక్కడా అనుమతి లేకుండా విద్యుదుత్పాదన సాగిస్తోంది. దాంతో విడుదలయ్యే నీరు పులిచింతలకు చేరుతోంది. తెలంగాణ అధికారులు అక్కడకూడా కరెంటు ఉత్పత్తి చేస్తుండడంతో.. అటునుంచి నీరు ప్రకాశం బ్యారేజీకి ప్రవహిస్తోంది. బ్యారేజీలో 3 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.




ఫలితంగా కృష్ణా డెల్టా రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఎగువన కర్ణాటకలో ఆలమట్టి గేట్లను ఎత్తి కిందకు నీళ్లొదిలితే తప్ప.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండవు. ఇప్పట్లో ఆలమట్టి నుంచి నీళ్లొదిలే పరిస్థితి కనిపించడం లేదని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 93.97టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 15,786 క్యూసెక్కుల ప్రవాహం ఆలమట్టిలోకి చేరుతోంది. దిగువన, జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్‌ పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిసామర్థ్యం 37.84 టీఎంసీలకు గాను.. 26.39 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. మరో 11.25 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరితేతప్ప నారాయణపూర్‌ నిండదు. అది నిండితేనే దిగువకు నీరు వదులుతారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌ దుస్థితి మరీ దయనీయంగా ఉంది.




శ్రీశైలం గరిష్ఠ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడు అత్యల్పంగా 43.27 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. పూర్తిగా నిండాలంటే మరో 173 టీఎంసీల వరద రావాలి. సాగర్‌లో గరిష్ఠ నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను .. 176.26 టీఎంసీల నిల్వ ఉంది. మరో 135.79 టీఎంసీల వరద రావాలి. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను.. 21.21 టీఎంసీల నిల్వ ఉంది. అట్టడుగున ఉన్న ప్రకాశం బ్యారేజీలో గరిష్ఠ నీటి నిల్వలు (3.07 టీఎంసీలు) ఉన్నాయి. వరద వస్తే సముద్రంలోకి వదలడం తప్ప గత్యంతరం లేదు.





40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.PH: 9390 999 999,    98481 97 222Jul 2 2021 @ 02:20AMహోంఆంధ్రప్రదేశ్తక్షణం జోక్యం చేసుకోండిఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

జల జగడంపై ప్రధాని మోదీకి సీఎం లేఖ


ప్రాజెక్టులన్నిటికీ సీఐఎస్‌ఎఫ్‌ భద్రత.. కృష్ణా బోర్డు పరిధి స్పష్టం చేయండి


శ్రీశైలం నీటిని తెలంగాణ అనధికారికంగా వాడేస్తోంది.. సమస్యలు సృష్టిస్తోంది


ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేసింది..


సాగర్‌, పులిచింతలలోనూ దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి


విడుదల చేసే నీరంతా ప్రకాశం బ్యారేజీకే..


అక్కడ నిల్వ వసతి లేదు.. వృథాగా సముద్రంలోకే


అందుకే జోక్యం అవసరం: ప్రధానికి సీఎం అభ్యర్థన..


జలశక్తి మంత్రి షెకావత్‌కూ విడిగా లేఖ




అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు సృష్టిస్తోందని.. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుల నుంచి దౌర్జన్యంగా తెలంగాణ నీటిని తోడేయకుండా ఉండేందుకు .. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు  కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని అభ్యర్థించారు. జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా తెలంగాణ నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం జగన్‌ ప్రధానికి గురువారం నాడు ఐదు పేజీల లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా విడిగా ఈ అంశంపై లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందని ప్రధానికి సీఎం వివరించారు.




తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలే తీరుస్తున్నాయని.. సాగర్‌, జూరాల ప్రాజెక్టులను తెలంగాణ పర్యవేక్షిస్తుంటే.. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) సమయానుకూలంగా నీటి కేటాయింపులు., వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఆ బాధ్యతల కేటాయింపు ఇంకా పూర్తికాలేదన్నారు. లేఖలో ఇంకా ఏమన్నారంటే..




మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.. 


‘2015 జూన్‌ 18,19 తేదీలో  కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299, ఆంధ్రకు 512 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి  విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శ్రీశైలం నుంచి 6.9 టీఎంసీలను ఏకపక్షంగా వాడేసింది. ఈ విషయాన్ని కేఆర్‌ఎంబీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నాగార్జున సాగర్‌ కూడా మరో ఉమ్మడి జలాశయం. ఈ ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా.. దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని తోడేస్తోంది. పులిచింతల నుంచి సైతం అక్రమంగా విద్యుదుత్పత్తిని చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌,  పులిచింతల జలాశయాల నుంచి నీటిని అక్రమంగా తోడేయడమే కాకుండా.. జల విద్యుదుత్పత్తి పూర్తి సామర్థ్యంతో చేపట్టేలా 34వ నంబరు జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది.




ఇలా ప్రధాన జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను కిందకు వదిలేయడం వల్ల చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.7 టీఎంసీ కావడంతో.. నీటిని నిల్వ చేసుకునే వీలు లేక కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. జలవిద్యుదుత్పత్తి ఆపేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించినా.. తెలంగాణ బేఖాతరు చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ నీటిని వాడేయడం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీరు కూడా అందని దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో తక్షణమే మీరు (ప్రధాని) ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.’




Jul 2 2021 @ 02:34AMహోంతెలంగాణదౌర్జన్యంగా విద్యుదుత్పత్తిఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

ప్రాజెక్టులన్నింటికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించండి

శ్రీశైలం నీటిని తెలంగాణ అనధికారికంగా వాడేస్తోంది

కృష్ణాబోర్డు పరిధి స్పష్టం చేయండి.. ప్రధానికి జగన్‌ లేఖ

విద్యుదుత్పత్తితో వదిలే నీరంతా ప్రకాశం బ్యారేజీకే

అక్కడ నిల్వ వసతి లేదు.. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకే

తక్షణమే జోక్యం చేసుకోండి.. తెలంగాణపై ఫిర్యాదు

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కూ విడిగా లేఖ



అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తూ తమ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు సృష్టిస్తోందని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుల నుంచి దౌర్జన్యంగా తెలంగాణ నీటిని తోడేయకుండా ఉండేందుకు.. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎ్‌సఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు  కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని అభ్యర్థించారు. జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ అక్రమంగా నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం జగన్‌ ప్రధానికి గురువారం నాడు ఐదు పేజీల లేఖ రాశారు.




కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా విడిగా ఈ అంశంపై లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందని ప్రధానికి సీఎం వివరించారు. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలే తీరుస్తున్నాయని.. సాగర్‌, జూరాల ప్రాజెక్టులను తెలంగాణ పర్యవేక్షిస్తుంటే.. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. లేఖలో ఇంకా ఏమన్నారంటే..




మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస ‘2015 జూన్‌ 18, 19 తేదీలో  కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి  విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శ్రీశైలం నుంచి 6.9 టీఎంసీలను ఏకపక్షంగా వాడేసింది. ఈ విషయాన్ని కేఆర్‌ఎంబీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నాగార్జునసాగర్‌ కూడా మరో ఉమ్మడి జలాశయం. ఈ ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని తోడేస్తోంది.


పులిచింతల నుంచి సైతం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం, సాగర్‌,  పులిచింతల జలాశయాల నుంచి నీటిని అక్రమంగా తోడేయడమే కాకుండా.. జల విద్యుదుత్పత్తి పూర్తి సామర్థ్యంతో చేపట్టేలా 34వ నంబరు జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా ప్రధాన జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను కిందకు వదిలేయడం వల్ల చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.7 టీఎంసీ కావడంతో.. నీటిని నిల్వ చేసుకునే వీలు లేక కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. జలవిద్యుదుత్పత్తి ఆపేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించినా.. తెలంగాణ బేఖాతరు చేస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణమే మీరు (ప్రధాని) ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.’

No comments:

Post a Comment